సెటైర్ : ఒకే బంగారం..అంటే ఊరుకోను

ప్రేమగురూజీ అయోమయంగా చూశాడు కృష్ణవైపు. తన పెద్దరికానికి ఎక్కడ భంగం కలుగుతుందోనని కాస్తంత భయపడ్డాడు. నిదానంగా అడిగాడు..

`నువ్వు చెప్పింది నిజమేనా ! అంతమాట అందా ?’

`అవును గురూజీ, అంతమాట అనేసింది. `ఛీపోరా..’ అంటూ ఈసడించుకుంది. కసురుకుంది. తన దగ్గరకు రావద్దంది. నా రాధలో ఉన్నట్టుండి మార్పు వచ్చేసింది గురూజీ…మార్పువచ్చేసింది…’
అంటూ ఏడుపు ముఖం పెట్టేశాడు కృష్ణ.

ఇంతకీ ఏం జరిగిందో వివరంగా చెప్పు కృష్ణ – అడిగాడు గురూజీ.

`మీకు తెలుసుగా గురూజీ, మా ప్రేమసంగతి. ప్రేమలో తొలిపాఠాలు నాకు నేర్పింది మీరేకదా. ఏం చెబితే ప్రియురాలు గలగలా నవ్వుతుందో, తియ్యటి కబుర్లు ఎలా చెప్పాలో… అన్నీ మీరు చెప్పినట్టే చేశానుకదా…’

`అవునవును, చేశావ్. అందుకే చక్కగా ప్రేమని ఎంజాయ్ చేస్తున్నావ్’

`మా జంట చూసి ఊరిజనం కళ్లుకుట్టేవంటేనమ్మండి.
రాధాకృష్ణల ప్రేమే పవిత్రమంటూ తెగపాడేసుకున్నాం. నువ్వులేక నేనులేనంటూ ఆడేసుకున్నాం…’

గురూజీ మధ్యలో అడ్డుతగులుతూ-
`అంతబాగా అర్థం చేసుకున్న రాధ ఇంతలో మరి నిన్ను `ఛీపో’ అని ఎందుకు అన్నదంటావ్ ?’

`అదే అర్థంకావడంలేదు గురూజీ. నిన్న నేను పార్క్ కు వెళ్ళానా… రాధ నాకు నచ్చిన పింక్ డ్రెస్ వేసుకుని చాలా వయ్యారంగా కూర్చుని వెయిట్ చేస్తోంది. రోజూలాగానే `హాయ్ బంగారం…’ అంటూ దగ్గరకు వెళ్ళాను. కానీ, నా స్వీట్ హార్ట్ అదోరకంగా చూసింది. నాకు అర్థంకాలేదు. బుర్రగోక్కున్నాను. మళ్ళీ `హాయ్ బంగారం’ అంటూ పలకరిస్తూ, `ఒకే బంగారం నీ అలుకకు కారణం కనిపెట్టేశాను. ఇవ్వాళ సినిమాకు వెళ్దామన్నావ్ కదా, ఒకే అలాగే వెళ్దాం బంగారం…’ అని ప్రేమతో అన్నాను. అంతే గురూజీ… గయ్యిన ఒంటికాలిమీద లేచింది. అరచినంతపని చేస్తూ, `ఒకే బంగారం అంటే ఊరుకోను జాగ్రత్త’ అంటూ వార్నింగ్ ఇచ్చేసి,విసవిసలాడుతూ వెళ్ళిపోయింది. అంతే గురూజీ…అంతే…నా ప్రేమ సౌథం కూలిపోయింది’ బోరున ఏడ్చేస్తున్నాడు కృష్ణ

ఇప్పుడర్థమైంది గురూజీకి. కృష్ణవైపు కోపంగా చూస్తూ…

`నీకసలు బుద్ధుందా… బంగారం, బంగారం అంటూ ప్రేయసి వెంటపడి తిరుగుతావా? నీకు బుద్ధిలేదురా…బుద్ధిలేదు’

కృష్ణ కంగారుపడ్డాడు. ఇదేమిటీ, నా సమస్యకు పరిష్కారం చెప్పడానికి బదులు, నేనేదో అనరానిది అన్నట్టు అలా కసురుకుంటాడేమిటబ్బా అని మనసులోనే అనుకుంటూ, ధైర్యం తెచ్చుకుని…
`అదికాదు గురూజీ నేనే ఏమన్నానని రాధ నామీద గయ్యిమంది’

గురూజీ కళ్లెర్రజేస్తూ…
` ఏమనాలి, ఇంతకన్నా ఏమనాలి… బంగారం ధరలు బాగా పడిపోతుంటే ఇప్పుడు నా బంగారం, నా మంచి బంగారం, ఒకే బంగారం.. అంటూ పలకరిస్తావా?’

బంగారం ధర తగ్గడానికీ, ప్రేమలో రాధ కసురుకోవడానికీ ఏమిటి సంబంధం గురూజీ. అమాయకంగా అడిగాడు కృష్ణ.

అతని అమాయకత్వానికి కోప్పడాలో, నవ్వుకోవాలో తెలియక చివరకు శాంతపడ్డాడు గురూజీ.

`చూడు కృష్ణ, నువ్వు ఒట్టి అమాయకుడివోయ్. నీకు లోకజ్ఞానం లేదు. ప్రేమించేవాడికి లోకజ్ఞానంకూడా ఉండాలి సుమీ. ఇప్పుడు నీవిషయమే తీసుకుందాం, బంగారం ధరలు బాగా తగ్గుముఖం పట్టినప్పుడు లవర్ ని `ఒసే బంగారం, రావే నా మంచి బంగారం’ లాంటి పదాలు వాడితో వాళ్లకు కోపంరాదా ..’

కృష్ణకు ఇంకా అయోమయం తొలగలేదు.

గురూజీ చెప్పుకుపోతున్నాడు.
`చూడు కృష్ణా, నిన్నమొన్నటిదాకా బంగారం విలువ ఎక్కువకాబట్టీ, అది పెరుగుతోంది కాబట్టి తమని బంగారం…బంగారం అని పిలిస్తే ఆడపిల్లలు లైక్ చేసేవారు. అలా ముద్దుముద్దుగా పిలిపించుకుంటూ తాము చాలా గొప్పని ఫీలైపోయేవారు..తన్మయత్వం చెందేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తులం బంగారం 20వేలకు పడిపోతుందని వార్తలొస్తున్నాయి. ఇంకెంత తగ్గుతుందో తెలియని పరిస్థితి. దీంతో అమ్మాయిల ఆలోచనల్లో మార్పులు వచ్చేశాయయ్యా… విలువతగ్గిన వస్తువుతో, అది బంగారం కావచ్చు, మరేదైనా కావచ్చు వాటితో పోలిస్తే మరి అమ్మాయిలకు కోపంరాదూ. నిన్నటిదాకా బంగారం అంటూ ప్రేమగా పిలిస్తే సెట్టయింది. కానీ ఇప్పుడు సెట్ కాదు. ట్రెండ్ మార్చేయాలి. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. లేటెస్ట్ ట్రెండ్ ఫాలోకాకపోతే నీకేకాదు, ఎవరికైనా ఇదే అనుభవం తప్పదు. ఈ గురూజీ చెప్పే సరికొత్త పాఠం ఇదే, నేర్చుకో…’

కృష్ణకు విషయం అర్థమైంది. తాను ఎంత తప్పుచేశాడో. తనకు లోకజ్ఞానం లేకపోవడం వల్లనే ఇంతటి విపత్తు వచ్చిందని తెలిసింది. వెంటనే లేచి వెళ్ళి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కొని చదవడం మొదలుపెట్టాడు. ఇకపై దేనితో పోలిస్తే లవర్ ఇష్టపడుతుందో తెలుసుకునేందుకు కసరత్తు మొదలెట్టాడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close