సెటైర్: `వ్యాపం’ ఆత్మల ఘోష

అదో శ్మశానవాటిక. మధ్యప్రదేశ్ లోని అతి పెద్ద శ్మశానవాటికల్లో అదొకటి. దీనికో ప్రత్యేకత ఉంది. పాత శవాలు పూర్తిగా కాలకుండానే కొత్త శవాలు `క్యూ’కడుతుంటాయక్కడ. ఆత్మఘోషలతో పట్టపగలే హడలెత్తించే ఈ శ్మశానం గేటు ముందు మాత్రం `వ్యాపం’ అన్న బోర్డు ఒకటి వ్రేలాడుతోంది.
ఇప్పుడు రాత్రి 11గంటల 59 నిమిషాలైంది. సాధారణంగా దెయ్యాలు అప్పటివరకూ ఎక్కెడెక్కడ తిరిగినప్పటికీ, సరిగా అర్థరాత్రి 12 గంటలకు ఒక చోట చేరడం వాటికి రివాజు.
అంతలో ఒక గొంతు చాలా గంభీరంగా వినబడుతోంది…
`ప్రియమైన వ్యాపం మృత్యు మిత్రులారా… రండి…త్వరగా రండి, ఈరోజు సర్వ ఆత్మ సభ్యుల సమావేశం జరుగుతోంది. విచ్చేయండి… ‘ అంటూ గంభీర ఆత్మ అలా అంటుండగానే ఏ చెట్టుమాటునుంచే, ఏ సమాధి రాళ్ల కిందనుంచో, మరే పాతపడ్డ బంగళా చీకటి గదుల్లోనుంచో ఆత్మలు రోదిస్తూ, ఘోషిస్తూ సభాస్థలికి చేరుకున్నాయి. క్షణాల్లో సమావేశం ప్రారంభమైంది. అది ఎలా సాగిందంటే….

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : ప్రియమైన ఆత్మలారా, మీకందరికీ తెలుసు, నా భౌతిక శరీరం పేరు అక్షయ్ సింగ్. ఇప్పడంటే ఇలా అయ్యానుగానీ, బతికున్నప్పుడు మంచి యాక్టీవ్ జర్నలిస్ట్ ను. టివీ ఛానెల్ లో అదరగొడుతుండేవాడ్ని. వ్యాపం స్కామ్ ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ, చేసుకుంటూ , చివరకు ఇదిగో ఇలా అయ్యాను. మనలో చాలా మంది మిస్టీరియస్ మరణాలకే గురయ్యామనుకుంటా…

డాక్టర్ అరుణ్ శర్మ : (కసురుకుంటూ) ఇదిగో అక్షయ్, ఇంకా ఏంటీ నీ మీడియా భాష పోదా… మిస్టీరియస్ మరణాలంటావేంటీ ? ఎవరికి మిస్టీరియస్, తెలుసుకోలేని వాళ్లకు. మనకు కాదు. ఈ వ్యాపం ఆత్మలున్నాయే… అంటే మనకు వాస్తవాలు బాగా తెలుసు. డొంక తిరుగుడు మానేసి, పాయింట్ కి వచ్చేయ్.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : నిజమే అరుణ్ శర్మ గారు. ప్రాణాలు పోసే వైద్యులు మీరు. కానీ చివరకు మీ ప్రాణాలే ఇలా ఆత్మల లోకంలో కలిసిపోయాయి. (నిట్టూర్పు) సరే, ఇప్పుడు మనం ఎందుకు సమావేశమయ్యామంటే, మనలో ఐక్యత ఉంటే ఈ వ్యాపం కుంభకోణంలోని అసలు దోషులను పట్టించవచ్చు.

డాక్టర్ అరుణ్ శర్మ : మనం ఓసారి ఒకరినొకరు పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో… ముందుగా నా గురించి… నేను బతికున్నప్పుడు జబల్ పూర్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్ ని. వ్యాపం స్కామ్ కారణంగా నేను బలైపోయాను. అయినా నా మరణం అనుమానస్పద ఖాతాలోనే ఉంది.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : ఇంతకీ ఈ సమావేశానికి ఎన్ని ఆత్మలు హాజరయ్యాయో ఓసారి లెక్క కట్టండి.
(ఒక పోలీస్ ఆత్మ చటక్కున లేచి)
పోలీస్ సంజయ్ : ఆపని నాకొదిలేయండి. జనాలను లెక్కపెట్టడమన్నా, వారిని లైన్ లో పెట్టడమన్నా నాకిష్టం. అయ్యా, నేను పోలీస్ కానిస్టేబుల్ని. వ్యాపం లో విట్ నెస్ గా ఉన్నాను. అంతే, ఉసురు పుటుక్కున పోయింది. చిత్రమేమంటే నేను చచ్చాక రెండు నెలలకు గానీ నా చావు గురించి ప్రపంచానికి తెలియలేదు. అదికూడా కోర్టులో నేను వాగ్మూలం ఇవ్వడానికి ఎందుకు రాలేదా ! అని అని ఆరాతీస్తుంటే నా చావుకబురు చల్లగా పెద్దలకు తెలిసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నేను ఎందుకు చచ్చిపోయానో తెలుసా… హెపటైటిస్ వ్యాధితో… సర్లేండీ నా గురించి తర్వాత చెబుతాను, ఇందాకే లెక్కగట్టాను… ఎంత మంది సమావేశానికి వచ్చారో చెబుతున్నా వినుకోండి. ఆఁ మొత్తం 49.

విద్యార్థి అమిత్ సాగర్ : (చిరు కోపంతో) నీయక్కమ్మా, ఏం లెక్క సారూ, మిమ్మల్ని మీరు లెక్కించుకున్నారా అసలు ? (కూలైపోతూ) అధ్యక్షా, మీరోసారి శ్మశానం గేటు వైపు చూడండి. అక్కడ లోపలకు రావడానికి గలాటా జరుగుతోంది.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : అవునవును. గేటు దగ్గర `వ్యాపం’ అని ప్రత్యేక బోర్డు కూడా పెట్టాము కదా, అయినా వేరే ఆత్మలన్నీ ఇలా తోసుకుంటూ వస్తే ఎలా….? (విసుగ్గా) బతికున్నప్పుడు ఎలాగో బుద్ధి కుదురు లేదు, ఇప్పుడు చచ్చిన తర్వాతైనా బుద్ధి కుదుర్చుకోకపోతే ఎలా….

విద్యార్థి అమిత్ సాగర్ : మిరలా ఆవేశపడిపోకండి సారూ… అలా దూసుకు వస్తున్నవారు కూడా వ్యాపం ఆత్మలేమో…ఓసారి కనుక్కుని వస్తాను. సరే, ఓసారి నా గురించి తమకు విన్నవిస్తాను. నా పేరు అమిత్ సాగర్. నేను కాలేజీ స్టూడెంట్ ని. నరహంతక కుంభకోణం గురించి నాకు తెలుసు. అది పెద్దోళ్లకి తెలుసు. ఫలితంగా నేను నీటమునిగి శవమై తేలాను. (గొంతు పెద్దది చేసి) ప్రియమైన వ్యాపం ఆత్మలారా… మీకు తెలుసు. మధ్యప్రదేశ్ లోని వ్యవసాయిక్ పరిక్షా మండల్ ఉందిగా, దాన్నే వ్యాపం అంటున్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైన పరీక్షలు గట్రా నిర్వహించే బోర్డ్ అన్నమాట. ఇకనేం అనేక లీలలకు నిలయమైంది ఇది. 1995 నుంచీ అవకతవకు జరుగుతంటే ఇప్పుడు ఈ కుంభకోణం నరహంతక స్కామ్ గా మారి కూర్చుంది.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : అవునవును… వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉన్న అనేకమంది మరణిస్తున్నారు. నువ్వన్నట్టు బయట గేట్ దగ్గర తోసుకుంటున్న వారు కూడా వ్యాపం ఆత్మలే కావచ్చు.

డాక్టర్ అరుణ్ శర్మ : ఈ కుంభకోణంతో లింక్ ఉంటే చాలు, డైరెక్ట్ గా ఇక్కడకు రావడానికి టికెట్ చింపేస్తున్నారు. మృతుల్లో మధ్యవర్తులు, పరీక్షలు రాసిన నకిలీ విద్యార్థులు, ప్రభుత్వఅధికారులు ఇలా చాలా మందే ఉన్నారు.

విద్యార్థి అమిత్ సాగర్ : (ఆవేశపడిపోతూ) సారూ, ఇప్పుడే అందిన వార్త.. మృతుల సంఖ్య సెంచరీ దాటిపోయిందట.
(ఈ మాటతో ఆత్మల ఘోష ఆకాశానికి అంటింది)
జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : ప్రియ ఆత్మలారా, శాంతించండి. ఒక్క వ్యాపంతోనే ఈ శ్మశానమంతా నిండిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక లాభంలేదు. పరిచయ వాక్యాలు పక్కనబెట్టి వెంటనే ఏదో ఒకటి చేయాలి.

డాక్టర్ అరుణ్ శర్మ : (నీరసంగా) ఏం చేయగలము, ఈ కుళ్లిపోయిన సమాజానికి ఏం చికిత్స చేయగలం. ప్చ్…

విద్యార్థి అమిత్ సాగర్ : (ఆవేశంగా) మీరు ఆలా ` ప్చ్ …’ అన్నా మేం ఊరుకోం. మా యువఆత్మశక్తి ఊరుకోదు.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : ఏం చేస్తారు ?

విద్యార్థి అమిత్ సాగర్ : (మరింతగా ఆవేశపడుతూ) ఏం చేస్తామా… మనం ఇప్పుడు ఆత్మలం. మన శక్తిని తక్కువగా అంచనా వేయకండి. భౌతికంగా చేయలేని పనుల్ని ఆత్మస్వరూపులుగా చేద్దాం. పదండి… కదలిరండి. ఈ నరహంతక కుంభకోణంలో మరెవరూ చిక్కుకోకుండా చూద్దాం. మన శక్తితో వాస్తవాలు బయటపడేలా చేద్దాం. ఎవర్నీ లెక్కచేసేదే లేదు.

జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ : భేషుగ్గా ఉంది ఐడియా. అలాగే చేద్దాం. (సభను ఉద్దేశించి) సోదర, సోదరీ ఆత్మలారా… ఈ యువ ఆత్మ చెప్పినట్టుగానే దూసుకుపోదాం పదండి. వ్యాపం కుంభకోణంలో సూత్రధారులను పట్టిచ్చేవరకు మనకు శాంతి లేదు…విశ్రాంతి లేదు.

(ఆ మాట వినగానే ఆత్మలన్నీ క్షణంలో శ్మశానం నుంచి మాయమయ్యాయి `ఇదేమన తక్షణ కర్తవ్యం’ అనుకుంటూ… )
– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close