చంద్రబాబుకు చుట్టుకున్న మరోవివాదం-‘వికీలీక్స్’ వార్తలను ఖండించిన యనమల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కోసం బేరాలు చేసిందని, ఆ సమాచారాన్ని వికీలీక్స్ బయటపెట్టిందని చెబుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, నమస్తే తెలంగాణ పత్రికలలో ఇవాళ వచ్చిన కథనాలను ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ కొట్టిపారేశారు. ఆ కథనాలు ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి చేసిన ప్రయత్నాలని అన్నారు. వికీలీక్స్ బయటపెట్టిన సమాచారంమేరకు –  ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖ హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో ఉన్న ఓర్టస్ అనే కంపెనీద్వారా రు.7.5 కోట్ల వ్యయంతో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనటానికి సిద్ధపడింది. ఈ కొనుగోలుకోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకరరెడ్డి హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తర మెయిల్స్‌ను వికీలీక్స్ బయటపెట్టింది. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని యనమల అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కొన్ని రాజకీయపార్టీలు, వారి తొత్తులుగా ఉన్న ఛానెళ్ళు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని మంత్రి స్పష్టీకరించారు. తాము ఏ విదేశీ సంస్థకూ ట్యాపింగ్ బాధ్యతలు అప్పగించలేదని చెప్పారు.

మీరు ఉదాశీనంగా, మందకొడిగా ఉండటంవల్లే ఓటుకు నోటు కేసులో తాము ఇరుక్కున్నామంటూ చంద్రబాబునుంచి అభిశంసనలు ఎదుర్కొన్నందుకు చురుకు పుట్టో, ఏమోగాని ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హడావుడిగా అత్యాధునిక పరికరాల కొనుగోలుకు ప్రయత్నించినట్లున్నారు. ఓటుకు నోటు జరిగిన తర్వాత హోంశాఖ అంతర్గత సమావేశాలలో చంద్రబాబు ఇంటెలిజెన్స్ శాఖ ఛీఫ్ అనూరాధపై మండిపడినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే తొలగిస్తే బాగోదని, ఒక నెల ఆగి ఆమెను ఆ బాధ్యతలనుంచి తప్పించి విజయవాడ కమిషనర్‌గా ఉన్న వెంకటేశ్వర్లుకు ఇంటెలిజెన్స్ శాఖను అప్పజెప్పారు.

పోలీసులు, ప్రభుత్వ గూఢచారి సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయటం సర్వసాధారణమే అయినప్పటికీ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో వికీలీక్స్ బయటపెట్టిన సమాచారం టీడీపీ ప్రత్యర్థులకు మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్లయింది. రేపటినుంచి టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు టీడీపీపై దాడిని మరింత ముమ్మరంచేసే అవకాశముంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close