సత్యదేవ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనికి కమర్షియల్ హిట్ దక్కకపోయినా… కావల్సినంత గౌరవం దక్కడానికి కారణం అదే. ఇప్పుడు ‘రావు బహద్దూర్’ అనే మరో కొత్త కథని చెప్పడానికి రెడీ అయ్యాడు. వెంకటేష్ మహా దర్శకుడు. మహేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ రోజు టీజర్ లాంటిది విడుదల చేశారు. ‘లాంటిది..’ అని ఎందుకు అన్నామంటే, ఇది ట్రైలర్ తో సమానమైన టీజర్. దాదాపు రెండున్నర నిమిషాల పాటు నిడివి ఉన్నటీజర్ ఇది. టీజర్ లో చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ‘అనుమానం పెనుభూతం’ అనే నానుడిని.. క్వాయినింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కథ కూడా ఈ పాయింట్ చుట్టూనే తిరిగే అవకాశం వుంది.
అన్నింటికంటే ముఖ్యంగా మేకింగ్ క్వాలిటీ బాగుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడం వల్ల కొత్త కలరింగ్ వచ్చింది. సత్యదేవ్ గెటప్పులు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మిస్టరీ, హారర్, ఫాంటసీ, ప్రేమకథ.. ఇవన్నీ ఈ సినిమాలో మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ తరవాత వెంకటేష్ మహా కథలు, ఆలోచనలపై గౌరవం ఏర్పడింది. దాన్ని.. రావు బహదూర్ కూడా నిలబెట్టుకొనేలానే ఉంది. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. వచ్చే యేడాది వేసవికి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం.
Happy to see Satyadev evolving and portraying larger-than-life characters.
My best wishes to him and Maha for #RaoBahadur. Can't wait to see what you guys are up to…@ActorSatyaDev @mahaisnotanoun pic.twitter.com/hNAdkIJIAk— rajamouli ss (@ssrajamouli) August 18, 2025