రితేష్ రానా మంచి సెటైర్ టచ్ వున్న దర్శకుడు. మత్తువదలరాతో హిట్లు కొట్టాడు. హ్యాపీ బర్త్ డే ఫ్లాఫ్ అయ్యింది. కానీ అందులో బోలెడంత మీమ్ కంటెంట్ వుంది. ఇప్పుడు సత్య హీరో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ‘జెట్లీ’అనే పేరు పెట్టారు.
విమానం పైన కూర్చున్న సత్య లుక్ చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఇక కామెడీ నా వల్ల కాదనే అర్ధం వచ్చేలా వున్న టాగ్ లైన్ లో కూడా ఫన్ వుంది. చిల్డ్రన్స్ డే స్పెషల్ అంటూ పోస్టర్ వదలడం ఈ సినిమా ఎంత ఫన్ ఫుల్ గా వుంటుందో చెబుతోంది.
అంతకుముందు ‘మనీ’లో బ్రహ్మానందంను ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా నవ్వించింది. తన టైమింగ్ తో సత్య కంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరింది. రితేష్ రానా మార్క్ లో సత్య ఫుల్ లెంత్ క్యారెక్టర్ కనిపిస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ వుంటుంది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వుంది. బజ్ విషయంలో ఈ సినిమాకి తిరుగుండకపోవచ్చు.
