“సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి..!”.. ఈ ట్రెండింగ్ దేనికి..?

జగన్ రెడ్డి బారి నుండి హిందువులను కాపాడండి అంటూ.. ఒక్క సారి ట్విట్టర్ ట్రెండింగ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా.. ఇది హైలెట్ అయింది. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డి పాస్టర్లుకు నెలకు రూ. ఐదు వేలు ఇవ్వాలనుకోవడమే కాదు.. తిరుమల శ్రీవారి విషయంలో ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరుగుతున్న పరిణామాలు.. ఇలాగే ఉన్నాయి. ధరలు పెంచి.. సామాన్యుడిని.. శ్రీవారికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థితిమంతులు అయితే తప్ప.. దేవుడ్ని దర్శించుకోలేరన్న పరిస్థితి కల్పిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు ఇప్పటికే ఆందోళనలు ప్రారంభించాయి. ఆ దేవుడు మన వాడు కాదని.. బడుగు బలహీనవర్గాల్లో వ్యాపింపచేసి.. మత మార్పిడులకు ప్రోత్సహించే వ్యూహం ఉందని హిందూత్వ వాదులు కొద్ది రోజుల నుంచి ఆరోపణలు కూడా చేస్తున్నారు.

అవసరం లేకపోయిన శ్రీవారి సేవల్ని భారం చేస్తున్న టీటీడీ..!

వారిని అందరికీ చేరువ చేయాల్సిన టీటీడీ.. అదే పనిగా భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తూ.. మరింత దూరం చేస్తోంది. ఇప్పటికే గదుల అద్దెను.. హోటళ్ల స్థాయికి పెంచేసిన టీటీడీ ఇప్పుడు.. మరిన్ని వినూత్నమైన వడ్డింపులకు రంగం సిద్దం చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి.. ఒక్క సారిగా… ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేగే సరికి.. అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని.. అదంతా అబద్దమని..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లుగా… కొత్త టీటీడీ పాలకమండలి ప్రకటించింది. కానీ.. వీఐపీ దర్శనం పేరుతో.. దాన్ని.. కొనసాగిస్తున్నారు. గతంలో ఆన్ లైన్ లో దొరికే టిక్కెట్లు ఇప్పుడు కొంత మందికే పరిమితమయ్యాయి. సామాన్యులకు కావాలంటే.. రూ. పదివేలను.. శ్రీవారి ట్రస్ట్‌కు.. విరాళం ఇచ్చి బ్రేక్ దర్శనం టిక్కెట్ పొందాలి. అంటే.. రూ. పది వేలకు బ్రేక్ దర్శనం టిక్కెట్లు అమ్ముకుంటున్నట్లే. అంటే… శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే.. వేలు ఖర్చు పెట్టే స్థోమత ఉండాలన్నమాట. అంటే… ధనవంతుల దేవుడని .. క్లారిటీ ఇస్తున్నట్లే. మరి పేదల దెవుడెవరు అన్న ప్రశ్నను ఉదయించేలా టీటీడీ వర్గాలు చేస్తున్నాయి.

అదే సమయంలో పాస్టర్లు రూ. 5వేల వేతనమంటూ హడావుడి..!

ఓ వైపు.. శ్రీవారిని భక్తులకు దూరం చేస్తూనే.. మరో వైపు మతం మార్చే పాస్టర్లు.. నెలవారీగా ప్రోత్సహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. చర్చి పాస్టర్లకు నెలకు రూ. ఐదు వేలు ఇస్తామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం.. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అవుతోంది. అసలు చర్చి పాస్టర్లను ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఇంత వరకూ.. క్లారిటీ ఇవ్వలేదు కానీ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద చర్చి పాస్టర్లు మాత్రం… రూ. ఐదు వేలు ఇచ్చేందుకు గ్రామ వాలంటీర్లతో ఎంపికలు కూడా ప్రారంభించారు. ఏపీలో అసలు క్రిస్టియన్స్ కన్నా.. మత మార్పిడి ద్వారా క్రైస్తవులైన వారే ఎక్కువ. అలాంటి వారే ఎక్కువగా పాస్టర్లుగా కూడా మారారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. ఎవరి సొమ్మును.. ముఖ్యమంత్రి.. పాస్టర్లకు నెల జీతాలుగా ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చను రాజకీయ పార్టీలు ప్రారంభిస్తున్నాయి.

మత మార్పిళ్లకు ప్రోత్సాహమా..?

నిజానికి అర్చకులకు అయినా… మౌజమ్‌లకు అయినా… వారు ఆ స్థాయికి చేరుకోవాలంటే.. ఓ ప్రమాణం ఉంటుంది. కానీ.. పాస్టర్లకు మాత్రం.. అలాంటిదేమీ లేదు. ఎవరైనా… ఏదో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పేరు పెట్టుకుని ప్రార్థనలు జరిపేసి.. పాస్టర్ గా మారిపోవచ్చు. వారి మత గ్రంధం చదవడం వస్తే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని పాస్టర్లుగా ఎంపిక చేసి జీతాలిస్తారనేది.. చర్చనీయాంశంగా మారింది. మత మార్పిళ్లకు పాల్పడిన వారినే పాస్టర్లుగా గుర్తిస్తారన్న చర్చ కూడా.. ఇప్పుడు.. ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.ఇది.. జాతీయ సమస్యగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close