నేర చరిత నేతల కేసుల విచారణకు వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్..!

నేర చరితులైన నేతల్ని రాజకీయాల నుంచి ఏరి వేసే లక్ష్యంతో సుప్రీంకోర్టు చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అమికస్ క్యూరీ ద్వారా అన్ని హైకోర్టుల నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. నేరచరిత గల నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో.. యాక్షన్‌ ప్లాన్‌ ఇవ్వాలని హైకోర్టులకు సూచించింది. యాక్షన్‌ ప్లాన్‌లో 9 అంశాలను చేర్చాలని ఆదేశించింది. త్వరితగతిన కేసుల పరిష్కారమయ్యేలా యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలని.. ప్రతి జిల్లాలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో.. ఎన్ని స్పెషల్‌ కోర్టులు అవసరమో చెప్పాలని ఆదేశించింది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి జిల్లాలోని పెండింగ్‌ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరు…పరిష్కారానికి పట్టే సమయాన్ని యాక్షన్ ప్లాన్‌లో పొందు పరచాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఇప్పటికే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాడానికి కేంద్రం సముఖత తెలిపింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాుట చేస్తామని..మౌలిక సదుపాయాల కల్పనకు రెండు నెలల సమయం చాలని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దాంతో సుప్రీంకోర్టు…అవినీతి నేతలపై కేసుల విచారణకు… తదుపరి చర్యలు ప్రారంభించింది. హైకోర్టుల ద్వారా ప్రత్యేక కోర్టుల అవసరాలను తెలుసుకుని.. ఆ తర్వాత ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు.. మాజీ ప్రజా ప్రతినిధులపై దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు తేల్చేసే అవకాశం కనిపిస్తోంది.

నేర చరితుల్ని రాజకీయాల నుంచి దూరం చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. గతంలో రెండేళ్ల శిక్ష పడిన వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకువచ్చారు. అయితే భారతీయన్యాయవ్యవస్థలో కేసుల విచారణలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. చట్టాల్లో లొసుగులను ఆధారంగా చేసుకుని నేతలు.. కేసులు విచారణకు రాకుండా చేసుకుంటున్నారు. ఈ కేసులు ఎప్పటికీ తేలకపోతూండటంతో…సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆ నేరచరితల అంశాన్ని తేల్చాలని డిసైడయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ... అధికారికంగా మాత్రం సీఎస్...

రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్...

వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క...

రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా...

HOT NEWS

[X] Close
[X] Close