జయలలితకు మళ్ళీ కష్టాలు మొదలు

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించి, ఆమెకి ప్రత్యేక కోర్టు విదించిన నాలుగేళ్ళ జైలు శిక్షని, రూ.100 కోట్ల జరిమానాని కర్ణాటక హైకోర్టు కొట్టివేయడం ఆ తరువాత ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేస్తూ కొన్ని రోజుల క్రితం ఒక పిటిషన్ వేసింది. దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఆ కేసును ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దీనితో ఆమె మళ్ళీ మరో సుదీర్గ న్యాయపోరాటానికి సిద్దం కావలసిన పరిస్థితి ఏర్పడింది.

ఇటువంటి కేసులు వేయడంలో చాలా సుప్రసిద్దుడని పేరు పొందిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆమెపై ఈ కేసు వేశారు. అప్పటి నుండి సుదీర్గకాలం దీనిపై విచారణ జరిగిన తరువాత క్రిందటి సంవత్సరమే కర్నాటక హైకోర్టు ఆమెకు ఆ కేసు నుండి విముక్తి కల్పించింది. కానీ కర్ణాటక ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళడంతో జయలలితకు మళ్ళీ కొత్త కష్టాలు మొదలయ్యాయి.

ఈ ఏడాది మే-జూన్ నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించడం వలన ఆమెకు రాజకీయంగా కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నాలుగయిదు నెలల వ్యవధిలో సుప్రీం కోర్టు కూడా కర్ణాటక హైకోర్టు తీర్పునే సమర్దించి ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లయితే ఇక ఈ ఎన్నికలలో అన్నాడిఎంకె పార్టీ గెలుపు తధ్యమని భావించవచ్చును. బహుశః అందుకు ఆమె మోడీ ప్రభుత్వ సహాకారం అవసరం ఉంటుంది. బీజేపీ కూడా తమిళనాడులో నిలద్రొక్కుకోవడానికి ఆమె చుట్టూ చాలా కాలంగా ప్రదక్షిణాలు చేస్తోంది.

ఇటీవల చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా చెన్నై వెళ్లి ఆమెను కలిసి, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి వచ్చేరు. ఆ హామీని నిలబెట్టుకొంటూ తక్షణమే భారీగా నిధులు, సహాయపునరావాస చర్యలకు అవసరమయిన ఏర్పాట్లు చేసారు. అదే విశాఖలో హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా మోడీ వచ్చి పర్యటించిన తరువాత రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దానిని తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ఆరు నెలలపాటు కాళ్ళు అరిగిపోయేలా తిరగవలసి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రప్రభుత్వం చూపించిన ఈ తేడాను గమనించినట్లయితే, జయలలితని ప్రసన్నం చేసుకొని ఆమె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నిస్తోందో అర్ధం చేసుకోవచ్చును.

కనుక బీజేపీతో పొత్తులకు ఆమె సిద్దపడినట్లయితే, ఈ కేసు నుంచి చాలా తేలికగా, శాస్వితంగా బయటపడేందుకు కేంద్రప్రభుత్వం కూడా ఆమెకు సహకరించవచ్చును. ఆ రెండు పార్టీల మధ్య రానున్న రోజుల్లో బంధం ఏర్పడినట్లయితే అదే ఈ కేసు నుంచి ఆమె తప్పకుండా బయటపడతారని చెప్పడానికి తొలి సంకేతంగా భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌: క్రియేటివిటీ క‌నిపించింది

https://www.youtube.com/watch?v=9Lg-QFxx5To చిన్న సినిమాకి హంగు - ఆర్భాటాలూ ఏం ఉండ‌వు. క‌థే దాని బ‌లం. ప్రచారంతోనే జ‌నాన్ని ఆక‌ర్షించాలి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంత వెరైటీగా కట్ చేస్తే - అంత‌గా జ‌నం దాని గురించి...

అమరావతి కోసం బీజేపీ ఎవరిపై పోరాడుతుంది..!?

అమరావతి రాజధాని అనేది బీజేపీ విధానం అని... రాజధాని రైతుల కోసం పోరాడుతామని.. భారతీయ జనతా పార్టీ నేతలు... వారి మిత్రపక్షం.. జనసేన చెబుతోంది. అయితే.. వారు ఎవరిపై పోరాడతారన్నదానిపై క్లారిటీ...

“స్టేటస్‌కో ” పై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల అమలుపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్టేటస్...

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపునకు అష్టకష్టాలు పడిన సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి చాలా చర్చలు బయట జరుగుతున్నాయి కానీ.. అసలు వాస్తవం ఏమిటో బయటకు తెలియడం లేదు. జీతాలు, ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో... ఆర్థిక కష్టాలు వెలుగులోకి...

HOT NEWS

[X] Close
[X] Close