అస‌లు నిజాన్ని చూపించే మ‌రో నేత్రం ‘విరూపాక్ష‌’

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా కార్తీక్ దండు ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ గ్లిమ్స్ కూడా విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ తో.. ఈ గ్లిమ్స్ మొద‌లైంది.

”అజ్ఞానం భ‌యానికి మూలం
భ‌యం మూఢ‌న‌మ్మ‌కానికి కార‌ణం..
ఆ న‌మ్మ‌క‌మే నిజ‌మైనప్పుడు
ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్క‌న‌ప్పుడు
అస‌లు నిజాన్ని చూపించే మ‌రో నేత్రం..”

అనేగానే… విరూపాక్ష అనే టైటిల్ రివీల్ అయ్యింది. చేత‌బ‌డి లాంటి మూఢ‌న‌మ్మకాల చుట్టూ ఓ గ్రామం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు. వ‌చ్చే యేడాది ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని తీసుకొస్తారు. ఫ‌స్ట్ గ్లిమ్స్ తో.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ట‌చ్ చేయ‌ని క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌ది అర్థ‌మైంది. మ‌రి ఈ సినిమా తేజూకి ఎంత వ‌ర‌కూ ప్ల‌స్ అవుతుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.