మ‌హేష్ తో ఫైట్‌.. డ‌స్ట్ బిన్ లోకి!

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌లై.. స‌గం పూర్త‌వ్వాల్సింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ప్రాజెక్టు ఆల‌స్య‌మ‌వుతోంది. ఇది వ‌ర‌కు త్రివిక్ర‌మ్ కి మ‌హేష్ ఓ క‌థ చెప్పాడు. దాంట్లో మార్పులూ చేర్పులూ సూచించ‌డంతో.. రిపేర్లు చేసీ, చేసీ.. అల‌సిపోయి, ఆ క‌థ‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ఫ్రెష్షుగా కొత్త క‌థ రాసుకొన్నారు. ఈ నెలాఖ‌రున గానీ, సంక్రాంతి అయ్యాక గానీ షూటింగ్ మొద‌ల‌వుతుంది.

అయితే.. ఇది వ‌ర‌కు పాత క‌థ‌తో ఓ షెడ్యూల్ జ‌రిగింది. అందులో భాగంగా ఓ ఫైటు కూడా తీశారు. ఎలాగైనా స‌రే.. ఆ ఫైట్‌ని కొత్త క‌థ‌లో వాడేద్దామ‌ని చూశారు. కానీ కుద‌ర‌డం లేదు. కొత్త క‌థ‌లో ఆ యాక్ష‌న్ సీన్ ఇమ‌డ‌డం లేదు. దాంతో ఆ ఫైట్ ఇప్పుడు డ‌స్ట్ బిన్‌లోకి నెట్టేసిన‌ట్టే. ఆ ఫైట్ కోసం దాదాపుగా ఏడెనిమిది కోట్లు వ‌చ్చించిన‌ట్టు స‌మాచారం. ఆ డ‌బ్బంతా వృథా అయిన‌ట్టే. పూరి – విజ‌య్ దేవ‌ర‌కొండ `జ‌న‌గ‌ణ‌మ‌న‌` విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ సినిమా మొద‌లెట్టి. కొన్ని సీన్లు తీశారు. ఆయా స‌న్నివేశాల‌కు దాదాపు రూ.12 కోట్లు ఖ‌ర్చ‌య్యింది.తీరా చూస్తే ప్రాజెక్టు ఆగిపోయింది. ఇలా… కోట్ల రూపాయ‌ల నిర్మాత‌ల సొమ్ములు వృథా అయిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close