సుజనా కోసం ఏపీ సర్కార్ సీక్రెట్ ఆపరేషన్..!

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో వారం రోజులుగా.. ఏపీ రెవిన్యూ అధికారులు మకాం వేశారు. ప్రతీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను పరిశీలిస్తున్నారు. పలు గ్రామాల్లో.. ఈ సెర్చింగ్ జరుగుతోంది. ఏం చేసినా.. ఎలా చూసినా… వీరి లక్ష్యం ఒక్కటే.. ” ఇది సుజనా చౌదరికి చెందిన భూమినా..?. ఈ భూములు సుజనా చౌదరి బినామీలకు చెందినవా..? సుజనా చౌదరి 2014 నుంచి కొనుగోలు చేసిన భూమి ఎంత..? వారి బంధువుల భూమి ఎంత..? ఇలా.. ప్రతీ సందేహంలోనూ.. సుజనా చౌదరిని పెట్టుకుని విచారణ జరుపుతున్నారు. వారం రోజుల నుంచి ఈ పరిశీలన జరుగుతోంది. స్థానిక ఎమ్మార్వో ఇతర పనులేమీ పెట్టుకోకుండా.. సిబ్బంది మొత్తాన్ని వారికే కేటాయించి .. సహకరిస్తున్నారు.

సవాల్ చేసినందున సుజనా సంగతి తేల్చాలనుకుంటున్నారా..?

రాజధాని పరిధిలో… 2010 నుంచి ఒక్క అంగుళం భూమి కొనుగోలు చేసినా… నిరూపించాలంటూ.. సుజనా చౌదరి కొద్ది రోజుల కిందట.. విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. అంతకు ముందు ఆయన … సుజనా… పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో… సుజనా సవాల్‌ను విజయసాయిరెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. వెంటనే… ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బొత్స సత్యనారాయణ.. గతంలో కొన్ని కంపెనీల పేర్లు చెప్పి… కొంత మంది పేర్లు చెప్పి… అవి సుజనా చౌదరివేనని మాటల ద్వారా ఆరోపించారు. కానీ.. .వాస్తవాలు.. ఆధారాలు బయటపెట్టలేకపోయారు. ఎలాగైనా వాటిని బయట పెట్టాలని… ప్రభుత్వ యంత్రాంగాన్ని పెద్దలు పరుగులు పెట్టిస్తున్నారు.

రాజధానిలో సుజనా చౌదరికి ఉన్న బినామీ భూముల గురించి లెక్క తేలలేదా..?

మొదట సీడ్ క్యాపిటల్ పరిధిలో సుజనా కు.. వందల ఎకరాలున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. వివరాలు మొత్తం బయటకు తీసి.. యలమంచిలి అన్న ఇంటి పేరు ఉన్న వారివన్నీ.. సుజనా చౌదరి బినామీలేనన్నట్లుగా సాక్షిలో కథనాలు రాశారు. దీనిపై సుజనా చౌదరి.. సర్కార్ తీరును ఎద్దేవా చేశారు. దాంతో.. ప్రభుత్వంలో మరింత పట్టుదల పెరిగిందంటున్నారు. సీడ్ క్యాపిటల్ కాకపోతే… సీఆర్డీఏ పరిధిలో అయినా… సుజనా చౌదరి భూములను లెక్క తేల్చి… ఆయన గుట్టు బయట పెట్టాలని భావిస్తున్నారు. అందుకే.. ఆయన స్వగ్రామం ఉన్న కంచికచర్ల మండలం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 2014 నుంచి కొనుగోళ్లను పరిశీలించి.. బినామీలు ఉన్నారో లేదో.. చూస్తున్నారు.

జగన్ సర్కార్ టార్గెట్ చేస్తే అంతే..!?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని .. వేల ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేశారని.. ఆరోపించారు. వీరిలో సుజనా చౌదరిది కీలక హస్తమని నేరుగానే చెబుతూ ఉంటారు. అయితే… అధికారంలోకి వచ్చాక.. రికార్డులు మొత్తం తీస్తే.. సీడ్ క్యాపిటల్ పరిధిలో 2014లో కేవలం 180 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయన్న విషయం తెలినట్లుగా… ప్రచారం జరుగుతోంది. అందుకే.. నల్లగొండ సరిహద్దులో ఉన్నప్పటికీ… సీఆర్డీఏ పరిధిలో అంటూ.. ఏదో రకంగా.. తమ ఆరోపణలకు ఆధారాలు వెదుక్కునేపనిలో జగన్ సర్కార్ పడిందంటున్నారు. మొత్తానికి.. ఇప్పుడు.. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసమే.. ప్రభుత్వ యంత్రాంగం అంతా.. పని చేస్తోందని.. ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌పైకి గోనె ప్రకాష్‌రావును పంపిందెవరు..?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్నాడో లేడో తెలియని నేత గోనె ప్రకాష్ రావు. వైఎస్ ఉన్నప్పుడు.. ఆయన అనుచరునిగా.. హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న మధుయాష్కీని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు....

రివ్యూ: జ‌గ‌మే తంత్రం

హీరోకి ఓ ఇమేజ్‌, ద‌ర్శ‌కుడికి ఓ బ్రాండ్.. ఉండాల‌ని కోరుకుంటారు. అవి ప‌డిపోతే... వాళ్లు ఆయా రంగాల్లో నిల‌బ‌డిపోయిన‌ట్టే. కాక‌పోతే... ఇమేజ్‌, బ్రాండ్ అనేవి వాళ్ల కెరీర్‌కి అనుకోని అడ్డుగోడ‌లుగా మిగిలిపోతాయి. వాళ్ల‌నుంచి...

జగన్ “క్యాలెండర్‌”పై నెగెటివ్ టాక్..!

ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్స్ క్యాలెండర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాత ట్వీట్లను బయటకు తీయడమే కాదు.. ఇటీవలి కాలంలో చేసిన ప్రకటనలను కూడా బయటకు...

అశోక్‌గజపతిరాజును జైలుకు పంపుతాం : విజయసాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్ట్ మళ్లీ తమ చేతుల్లో నుంచి జారిపోయిందని అసహనమో... చేయాలనుకున్న భూ మాయ అంతా చేయలేకపోతున్నామన్న ఆగ్రహమో కానీ.. ఉత్తరాంధ్ర సీఎంగా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి కంట్రోల్ తప్పి...

HOT NEWS

[X] Close
[X] Close