కుబేర సినిమాకి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. 3 రేటింగ్ కి తగ్గకుండా రివ్యూలు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పుపొందిన సినిమా కుబేరనే. అయితే ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే కంప్లయింట్. సినిమా నిడివి ఎక్కువైయింది. ఎడిటింగ్ లో ఇంకాస్త పదును చేసి వుండొచ్చనే విమర్శ వినిపించింది. ఇదే విషయాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర ప్రాస్తావిస్తే.. ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. లెంత్ విషయంలో తగ్గేదేలే అన్న భావం ఆయన మాటల్లో కనిపించింది.
”కుబేర కి లెంత్ ఎక్కువైయిందనే విమర్శ విన్నాను. నిజానికి లెంత్ గురించి ఒక దర్శకుడికి, టీంకి తెలియకుండా వుండదు. కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి. ఒక పాయింట్ ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం. ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. ఈ సినిమాని మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కొత్తగా కనిపిస్తాయి’ అని చెప్పుకొచ్చారు శేఖర్. అలాగే.. కుబేరని తన కెరీర్ లో ట్రూ ఫిల్ జాబితాలో చేర్చారు.” నేను చేసిన సినిమాల్లో కుబేర వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. సినిమాకి వచ్చిన యునానిమిస్ రిపోర్ట్ తో చాలా ప్రౌడ్ గా ఉంది’ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు శేఖర్.