మాఫియా మాయ‌లో… శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు ఎలా ఉంటాయి? సాయింత్రపు గాలిలా చ‌ల్ల‌ద‌నాన్ని పంచుతాయి. వ‌ర్షాకాలంలో కాఫీలా.. వెచ్చ‌ద‌నాన్ని అందిస్తాయి. శీతాకాల‌పు మంచు తుంప‌ర‌లా ఆహ్లాద‌క‌రంగా ఉంటాయి. ప్రేమ‌లూ, స్నేహాలూ, బంధాలూ… వీటి చుట్టూనే ఆయ‌న క‌థ‌లు సాగుతుంటాయి. కానీ… ఈసారి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా అలా ఉండ‌డం లేదు. తొలిసారి శేఖ‌ర్ క‌మ్ముల క‌మ‌ర్షియ‌ల్ కోణంలో ఆలోచించ‌డం మొద‌లెట్టారు. నాగార్జున‌, ధ‌నుష్‌ల‌తో ఆయ‌న ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఓ కొత్త శేఖ‌ర్ క‌మ్ముల క‌నిపించ‌బోతున్నార‌ని టాక్‌.

మాఫియా నేప‌థ్యంలో సాగే కథ‌తో శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమాని తీస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో డాన్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ‘మ‌నీ హీస్ట్‌’ అనే ఓ వెబ్ సిరీస్ ఉంది. ఈ క‌థ కూడా అలాంటి సెట‌ప్ లోనే ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. చీక‌టి వ్యాపారం, బ్లాక్ మ‌నీ, దోపిడీ… ఇలా పూర్తి యాక్ష‌న్ పంథాలో సాగ‌బోతోంద‌ట‌. శేఖ‌ర్ క‌మ్ముల నుంచి ఇలాంటి సినిమా రావ‌డం నిజంగా షాకింగ్ విష‌య‌మే. కాక‌పోతే.. హింస‌, ర‌క్త‌పాతం ఇలాంటివి శేఖ‌ర్ క‌మ్ముల‌కు న‌చ్చ‌వు. అవి లేకుండా ఇలాంటి సినిమాలు తీయ‌డం సాధ్యం కాదు. మ‌రి.. వాటిని శేఖ‌ర్ క‌మ్ముల ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close