‘మ‌ట్కా’ గ్లింప్స్‌: వ‌రుణ్ తేజ్ చేసిన ‘ప్రామిస్’

సినిమా జ‌యాప‌జ‌యాల మాటెలా ఉన్నా, ఎప్పుడూ ఏదో కొత్త‌గా ప్ర‌య‌త్నించే హీరోల్లో వ‌రుణ్ తేజ్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. త‌న చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి ‘ఆప‌రేష‌న్ వాలైంటేన్‌’. రెండోది ‘మ‌ట్కా’. రెండూ వేర్వేరు జోన‌ర్లే. ‘ఆప‌రేష‌న్ వాలైంటేన్‌’లో నికార్స‌యిన దేశ‌భ‌క్తుడిగా క‌నిపిస్తున్నాడు వ‌రుణ్‌. ‘మ‌ట్కా’లో అయితే… ఓ గ్యాంబ్ల‌ర్‌గా మారిపోయాడు. క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పిరియాడిక్ డ్రామా ‘మట్కా’. ఈరోజు వ‌రుణ్ తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘మ‌ట్కా’ గ్లింప్స్ విడుద‌లైంది. ఈ గ్లింప్స్‌తో.. సినిమా క‌ల‌ర్‌, టోన్‌తో పాటు నేప‌థ్యాన్నీ ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. వ‌రుణ్ లుక్‌.. చాలా స్టైలీష్‌గా ఉంది. చేతిలో సిగార్‌తో జ‌స్టిజ్ చౌద‌రి స్టైల్ లో క‌నిపిస్తున్నాడు. ‘ప్రామిస్’ అనే ఒకే ఒక్క డైలాగ్ ఈ గ్లింప్స్‌లో వినిపించింది. వ‌రుణ్ ఎవ‌రికి ప్రామిస్ చేశాడు? దాని వ‌ల్ల ఎలాంటి ప‌ర్య‌వ‌సానాలు ఎదుర‌య్యాయి అనేదే ఈ సినిమా ఇతివృత్తంలా క‌నిపిస్తోంది. మిగిలిన పాత్ర‌ధారుల గెట‌ప్పులు కూడా నాస్టాజిక‌ల్ ఫీలింగ్ తీసుకొస్తోంది. జీ.వి. ప్ర‌కాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ క‌ట్టిప‌డేస్తున్నాయి. నోరా ఫ‌తేహీ, మీనాక్షీ చౌద‌రి క‌థానాయిక‌లు. న‌వీన్ చంద్ర ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close