టీటీడీ బోర్డులోకి మళ్లీ శేఖర్ రెడ్డి..! ఇదే కదా అవినీతి అంటే..!?

24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఏర్పడిన టీటీడీ పాలకమండలిలో కొత్తగా.. మరో ఏడుగురికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా చాన్సిచ్చారు. వీరిలో తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి ఉండటం కలకలం రేపుతోంది. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన కరుణాకర్ రెడ్డి , శేఖర్‌రెడ్డి, రాకేష్‌ సిన్హా, కుపేందర్‌ రెడ్డి గోవింద హరి, దుష్మంత్‌కుమార్‌, ఆమోల్‌ కాలే లను నియమించారు. శేఖర్ రెడ్డి ఏపీ ప్రజలకే కాదు.. దేశం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే నోట్లను రద్దు చేసినప్పుడు.. ప్రజలంతా.. చెల్లుబాటయ్యే నోటు ఒక్కటంటే.. ఒక్కదాని కోసం.. ఏటీఎంల ముందు. రోజంతా పడిగాపులు పడుతున్న సమయంలో. ఈ శేఖర్ రెడ్డి ఇంట్లో.. కోట్లకు కోట్ల కొత్త నగదు పట్టుబడింది.

ఏటీఎంలలో పెట్టడానికి నగదే లేదని ఆర్బీఐ అంటోన్న సమయంలోనే… అంతకు మించిన నిధి.. ఆయన ఇంట్లో దొరికింది. అందుకే.. అప్పుడు ఆయన.. దేశం మొత్తం హాట్ ఫేవరేట్ అయ్యారు. అప్పట్లో ఇది ఒక సంచలనం అయ్యింది. ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ బీజేపీ, వైసీపీ విమర్శలు చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి … దాంతో పాటు సాక్షి… చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. శేఖర్ రెడ్డి వద్ద పట్టుబడిన సొమ్ము అంతా.. చంద్రబాబుదని.. లోకేష్ దని రోజువారీ కథనాలు ప్రసారం చేశారు. చివరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ శేఖర్ రెడ్డికి.. లోకేష్‌కు కూడా లింక్ పెట్టారు.

అన్ని రాజకీయ ఆరోపణలు ముగిసిన తర్వాత ఇప్పుడు.. అదే శేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి … టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించారు. అప్పట్లో పట్టుబడిన డబ్బు విషయంలో శేఖర్ రెడ్డి కోర్టు క్లీన్ చిట్ లభించింది. కోర్టులో సీబీఐ సరైన వాదనలు వినిపించలేదు. అది అక్రమ సంపాదన కాదని కోర్టు తేల్చింది. శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ వచ్చిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనను అన్యాయంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి తొలగించాలని.. తనకు మళ్లీ మెంబర్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. మొత్తానికి శేఖర్ రెడ్డి వెనుక ఉన్నది చంద్రబాబు, లోకేష్ కాదని.. జగన్మోహన్ రెడ్డి అని అనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని.. టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close