‘బాహుబలి’ ఓ స్టుపిడ్‌ సినిమా అంటున్న అలనాటి హీరోయిన్‌!

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ ‘బాహుబలి’, తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన గొప్ప సినిమా ‘బాహుబలి’, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’…ఇలా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొన్ని రోజులపాటు తుఫానులా పట్టి కుదిపేసిన విషయం తెలిసిందే. కానీ, ‘బాహుబలి’ ఓ స్టుపిడ్‌ సినిమా’ అని ఒకరు విమర్శించారు. ఈమాట అన్నది ఎవరో కాదు అలనాటి టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ జమున.

శనివారం రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జమున ఈ విధంగా వ్యాఖ్యానించింది. తన మనవడి బలవంతం మీద ‘బాహుబలి’ చిత్రాన్ని చూశానని, నిజంగా అది ఓ స్టుపిడ్‌ సినిమా అనీ, దీని కంటే పెద్ద పదం ఏదైనా వుంటే ఆ సినిమాకి ఉపయోగించవచ్చునని జమున ఘాటుగా చెప్పారు. టెక్నికల్‌ వేల్యూస్‌ తప్ప సినిమాలో ఏమీ లేదని, ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ తప్ప మిగతా పాత్రలన్నీ పనికి రానివనీ, ఆ పాత్రలకు తగిన ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోవడంలో రాజమౌళి విఫలమయ్యాడని అన్నారు. తమన్నా స్థానంలో అనుష్కను ఎంపిక చేసి వుంటే బాగుండేదని జమున అభిప్రాయ పడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close