ఏపీ సీఎంను ఢిల్లీ కావాలనే అవమానిస్తోందా..?

“అపాయింట్‌మెంట్ ఉంది.. రమ్మనండి..” అని భరోసా వస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక… నిలువుకాళ్లపై పడిగాపులు పడాల్సి వస్తుంది. అంత పడినా… అనుకున్న అపాయింట్‌మెంట్ దొరుకుతుందా… అంటే అదీ లేదు. మళ్లీ ఉసూరుమంటూ వెనక్కి తిరగాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ సామాన్యులకో వస్తే.. ఈ రాజకీయ నేతలు ఇంతే.. అని ఓ సారి అనుకుని ఊరుకుంటారు. కానీ.. ఐదు కోట్ల ఆంధ్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తోంది. ఒక్కసారి కాదు.. పదే పదే వస్తోంది. అందుకే.. కేంద్రం పెద్దలు ఏపీ సీఎంను.. కావాలనే అవమానిస్తున్నారా.. అనే చర్చ ప్రారంభమయింది.

మోడీ, అమిత్ షా… జగన్‌ను ఎందుకు కలవడం లేదు..!?

ప్రధానిగా మోడీ… హోంమంత్రిగా, బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా క్షణం తీరిక లేకుండా ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వారు కాస్త రిలీఫ్ గా ఉంటారు. ఎలాంటి సమావేశాలు పెట్టుకోకుండా ఢిల్లీలో ఉంటారు. వారిని కలవాలనుకునేవారికి ఇదో గొప్ప అవకాశంగా ఉంది. అందుకే.. చాలా మంది.. ఇలాంటి సమయంలో.. వారిద్దర్నీ కలుస్తున్నారు. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు కూడా..కలిశారు. తీరా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే సరికి.. వారి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండటం లేదు. సమయం లేదనే.. సమాచారం వస్తోంది. ఇలా చేయడానికి కారణం ఏమిటన్నదానిపై.. వైసీపీ వర్గాలకే క్లారిటీ లేకుండా పోయింది.

వ్యక్తిగత అంశాలు చెప్పుకోవడానికి వస్తున్నారనే దూరం పెడుతున్నారా..?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆయనకు కేంద్ర పెద్దలతో వ్యక్తిగత సంబంధాలుండవు. వారితో భేటీ అయితే.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే చర్చించాలి. ఏం కావాలో అడగాలి.. ఏపీ ప్రజల కోసం.. ఏం అవసరమో వివరించాలి. అయితే.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కారణాలు … ఇతర అంశాలు చెప్పుకోవడానికి వస్తున్నారన్న పక్కా సమాచారం ఉండటంతోనే… కేంద్రం పెద్దలు దూరం పెడుతున్నారనేది.. ఢిల్లీలో వినిపిస్తున్న ఓ ప్రధాన కారణం. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరినప్పుడు… ఆయన కార్యాలయం.. కారణం అడుగుతుంది. అప్పుడు.. ఏం అడగాలనుకుంటున్నారో.. వైసీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. వ్యక్తిగత అంశాలే మాట్లాడటానికి వస్తున్నట్లుగా సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతోనే.. అమిత్ షా కార్యాలయం..లైట్ తీసుకుంటోందని అంటున్నారు.

జగన్‌ను దూరం పెడుతూ… ఓ రాజకీయ సందేశం పంపుతున్నారా..?

టీడీపీ ఎంపీలతో కొద్ది రోజుల కిందట అమిత్ షా సమావేశమయ్యారు. వారి భేటీ అరగంటకుపైగా జరిగింది. ఏపీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నారని మీడియాలో వచ్చింది. వారు కేవలం ఎంపీలు మాత్రమే. అదీ ముఖ్యమంత్రి వస్తూంటే… దూరం పెడుతున్నారు. కొంత మందిని కలిసి.. కొంత మందిని దూరం పెడుతూంటే.. కచ్చితంగా.. ఓ రాజకీయ సందేశాన్ని.. బీజేపీ పెద్దలు పంపుతున్నారని చెబుతున్నారు. ఎలా చూసినా.. ఏపీ సీఎంకు.. మోడీ, షాలు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడం.. పడిగాపులు పడినా.. ఫలితం లేకపోవడం.. అవమానించడం కిందకే వస్తుందని.. వైసీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

HOT NEWS

[X] Close
[X] Close