చ‌ర‌ణ్‌తో సినిమా : లొకేష‌న్ల వేట‌లో శంక‌ర్‌

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ లోనే తెర‌కెక్కిస్తారు. ప్ర‌స్తుతం శంక‌ర్ హైద‌రాబాద్ లోనే ఉన్నారు. ఆయ‌న లొకేష‌న్ల వేట‌లో బిజీ. మ‌రోవైపు… రామ్ చ‌ర‌ణ్ కోసం ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్ని సిద్ధం చేస్తున్నారు. వాటిలో ఫొటో షూట్ చేశాక‌.. ఓ గెట‌ప్ ని ఫైన‌ల్ చేస్తారు. స్కెచ్ ఆర్టిస్టులు, మేక‌ప్ నిపుణుల‌తో శంక‌ర్ మంతనాలు జ‌రుపుతున్నట్టు స‌మాచారం. శంక‌ర్ సినిమాల్లో.. హీరో ర‌క‌ర‌కాల గెట‌ప్పుల‌లో క‌నిపించ‌డం అల‌వాటు. పైగా ఈ సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ముందు నుంచీ వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ద్విపాత్రాభిన‌యం ఉన్నా, కాక‌పోయినా.. చ‌ర‌ణ్ కి కొత్త లుక్ లో చూపించాల‌న్న‌ది శంక‌ర్ ఆలోచ‌న‌. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close