షర్మిల పార్టీకి ఏడాది : ఎవరైనా లెక్కలోకి తీసుకున్నారా ?

తెలంగాణలో వైఎస్ కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం అనే ఆలోచనే విచిత్రంగా ఉంటుంది. కానీ తాను తెలంగాణ కోడల్నుంటూ హోదా సృష్టించేసుకుని ఆమె పార్టీ పెట్టారు. రాజకీయ పార్టీ నడపడం అంటే ఎంత కష్టమో.. ఖర్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కష్టాల్ని ఆమె భరిస్తున్నారు. ఇప్పటికి ఏడాది అవుతోంది. పాదయాత్ర కూడా ప్రారంభించారు. కానీ ఏమైనా ఫలితం కనిపిస్తుందా అంటే… పెదవి విరవక తప్పని పరిస్థితి. వైఎస్ అభిమానులంతా కలసి వస్తారనుకుంటే ఒక్కరూ రాలేదు. వైఎస్‌ సాయంతో ఎదిగిన రాజకీయ నేతలూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె పార్టీలో కీలక నేతలంటూ ఎవరూ లేకుండా పోయారు.

విచిత్రం ఏమిటంటే పార్టీలో చేరిన అరకొర నేతలు కూడా జంపయిపోయారు. పార్టీ మొదట్లో ఉన్న పలువురు సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం లేరు. వైఎస్సార్ బిడ్డగా కాస్తో కూస్తో ఆదరణ దక్కినా ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలం అయ్యారు. ఇందిరాశోభన్ తో పాటు పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కొండా రాఘవరెడ్డి సైతం పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ నుంచి వైఎస్సార్ టీపీలో చేరిన గట్టు రామచంద్రారావుదీ అదే పరిస్థితి. వచ్చిన కొద్దిరోజులకే ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఆ పార్టీ నుంచి వీడుతున్న వారే తప్ప కొత్తగా చేరికలు లేవు.

ఉమ్మడి ఖమ్మంలో తప్పితే మిగిలిన చోట్ల పాదయాత్రకు పెద్దగా జనం కనిపించలేదు. పాలేరులో పోటీ చేయాలని నిర్ణయాన్ని ఆమె అక్కడ ప్రకటించారు. ఏపీ బార్డర్ కావడంతో ఆ మాత్రం ఆదరణ దక్కిందని.. చెబుతున్నారు. నిరుద్యోగ నిరాహార దీక్ష, వరి దీక్ష, పాదయాత్ర వంటి కార్యక్రమాలకు కూలీలకు డబ్బులిస్తామని తీసుకొస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో పార్టీ ఏర్పాటు ప్రకటన సమయంలో ఫుల్హైప్‌లో ఉన్నా క్రమంగా పార్టీ తెరమరుగవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో షర్మిల కు అండగా ఉంటానని విజయమ్మ వైసీపీకి రాజీనామా చేసేశారు. మరి ఆమె కూడా పాదయాత్రలో కాలు కలిపి వైఎస్‌ కోసం అంటూ నాలుగు కన్నీటి బొట్లు రాల్చి సెంటిమెంట్ రగిలిస్తే ఏమైనా ఊపు వస్తుందేమోనని ఆ పార్టీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close