మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐకి షర్మిల ఫిర్యాదు !

ఓ వైపు అన్నకు ఆత్మీయ మిత్రుడైన మేఘా కృష్ణా రెడ్డిని .. చెల్లి సీబీఐ చెరలో బంధించేలా చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేసిన కృష్ణారెడ్డి కనీసం రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐకి ఫర్యాదు చేశారు షర్మిల, రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు పాదాయత్రను నిలిపివేసి మరీ వచ్చిన ఆమె.. కొన్ని రహస్య సమావేశాల్లో పాల్గొన్నారు బహిరంగంగా మాత్రం సీబీఐ డైరక్టర్‌ను కలిసి.. కాళేశ్వరంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి కలిసి అవినీతికి పాల్పడ్డారని.. విచారణ జరిపించాలని లేఖ ఇచ్చారు. కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్లుగా వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.

కొద్ది రోజులుగా మేఘా కృష్ణారెడ్డిపై షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ధనాన్ని పెద్ద ఎత్తున స్వాహా చేశారని.. కేసీఆర్ తో కుమ్మక్కయి.. పనికి రాని ప్రాజెక్టుల పేరుతో కోట్లు కొట్టేశారని ఆరోపిస్తున్నారు. నిజానికి మేఘా కృష్ణారెడ్డి విషయంలో ర్మిలకు అంతవ్యతిరేక ఉండాల్సిన అవసరం లేదు. కానీ అన్ని పార్టీల్లా.. తనను చూడటం లేదని అనుకున్నారేమో కానీ ఆయనను నేరుానే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఏకంగా సీబీఐనే టార్గెట్ చేశారు.

మేఘా కృష్ణారెడ్డి.. కేసీఆర్‌కు ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే జగన్‌కూ సన్నిహితడే. ఏపీలో రివర్స్ టెండరింగ్ వేసిన అన్ని ప్రాజెక్టులూ మేఘాకే దక్కాయి.ఇప్పుడు షర్మిల చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ విచారణ జరుపుతందా లేదా అన్న విషయం పక్కన పెడితే.. బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకుండా ఇలా ఫిర్యాదులు చేయలేరన్న వాదన మాత్రం వినిపిస్తోంది. మేఘా కేంద్రంగా ఓ పొలటికల్ ఆపరేషన్ జరిగే అవకాశం… ఉందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆన్‌లైన్‌కి ఎక్కిన మంచు బ్రదర్స్ గొడవలు !

మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయని అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని మంచు మనోజ్ బయట పెట్టారు . తన దగ్గర పని చేసే ఓ...

సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే...

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close