శర్వానంద్ కి చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉంది. ప్రేమ కథలకు, ఫ్యామిలీ డ్రామాలకు తను పర్ఫెక్ట్. తన లుక్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. లుక్ పరంగా ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. దాదాపుగా ప్రతీ సినిమాలోనూ ఒకేలా కనిపిస్తాడు. కానీ ‘భోగి’ కోసం మాత్రం మేకొవర్ స్పష్టంగా కనిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగనుంది. ఈ సినిమాలో శర్వా లుక్‌ని ఈరోజు రివీల్ చేశారు. చేతిలో కత్తి, గుబురు మీసం తో శర్వా లుక్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి రగ్గడ్ లుక్ లో శర్వాని ఇది వరకు చూడలేదు. సో.. లుక్ పరంగా శర్వాకు ఇది ప్రయోగమే అనుకోవాలి.
శర్వాకు కొంతకాలంగా బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాలు రావడం లేదు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ మాత్రం మంచి విజయాన్నిఅందించింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర హిట్ గా నిలబడింది. నిర్మాతలకు లాభాలు వచ్చాయి. ఈ ఉత్సాహంతో.. ‘భోగి’ షూటింగ్ లో పాలు పంచుకొంటున్నాడు. ఇంతకాలం రొమాంటిక్, చాక్లెట్ బోయ్ ఇమేజ్ తో కనిపించిన శర్వాకు లుక్ పరంగానే కాదు, క్యారెక్టరైజేషన్ పరంగానూ ‘భోగి’ కొత్త తరహా ప్రయత్నమే. సంపత్ నంది కూడా ఈ సినిమాతో హిట్టు కొట్టాలన్న కసితో పని చేస్తున్నాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది. రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
