ఏపీ సర్కార్‌పై విద్యుత్ కంపెనీ రివర్స్ ..!

పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంపై.. ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేట్లు తగ్గించాల్సిందేనని … ఏపీ సర్కార్.. కొన్ని విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ట్రిబ్యునల్ స్టే విధించింది. విద్యుత్ కంపెనీలకు నోటీసులు జారీ చేసిన విషయం ఇప్పటి వరకూ బయట పెట్టలేదు కానీ.. ఇలా నోటీసులు అందుకున్న కంపెనీల్లో గ్రీన్‌కో అనే కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీకి చెందిన మూడు విద్యుత్ యూనిట్లతో.. ఏపీ సర్కార్ … విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థతో ఏపీ సర్కార్.. యూనిట్‌ ను ధర రూ. 4.50కు కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే.. తక్షణం… రూ. రూ.2.44కి తగ్గించాలని.. ఏపీ సర్కార్ గ్రీన్‌కో కంపెనీకి నోటీసులు పంపింది. మూడు రోజుల క్రితం.. పీపీఏలపై సీఎం జగన్ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ విద్యుత్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయింది. వారెవరూ ధరలను తగ్గించేందుకు అంగీకరించలేదు.

ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన .. ప్రభుత్వ సలహాదారు అజేయకల్లాం… పీపీఏను రద్దు చేయడమే తరువాయన్నట్లుగా మాట్లాడారు. దీంతో… గ్రీన్ కో కంపెనీ.. తమకిచ్చిన నోటీసులపై… ట్రిబ్యూనల్‌లో పిటి,న్ వేసింది. ఈ పిటిషన్‌లో ఏపీ సర్కార్ తీరును.. వివరించింది. అసలు ధరల నిర్ణయం అనే ప్రక్రియతో.. ఏపీ సర్కార్ పాత్ర చాలా పరిమితమని.. ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందన్న గ్రీన్‌కో కంపెనీ ట్రిబ్యునల్‌లో వాదించింది. ఏపీ సర్కార్ .. తాము రాజస్థాన్ ప్రభుత్వానికి రూ.2.44కి యూనిట్‌ ఇస్తున్నామని.. అదే ధరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. అయితే.. సోలార్ ఎనర్జీ అనేది.. వాతావరణ పరిస్థితులను బట్టి వస్తుందని.. రాజస్థాన్ లో ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉంటుందని.. అదే ఏపీలో ఎక్కువ ఉంటుందని.. అలాంటి చోట… కూడా.. రాజస్థాన్ లో ఇచ్చినట్లే.. రూ.2.44కే ఇవ్వాలనడం సాధ్యం కాదని గ్రీన్‌కో స్పష్టం చేశారు. దీనిపై ట్రిబ్యునల్ స్పందించింది.జులై 12న గ్రీన్‌కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు.. ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పు పట్టింది.

గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే విధించింది. నిజానికి .. పీపీఏ విషయంలో.. ఎలాంటి దూకుడైన నిర్ణయాలు తీసుకోవద్దని.. అది పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతూ.. కేంద్రం ఇప్పటికే ఏపీ సర్కార్ కు రెండు సార్లు లేఖలు రాసింది. అగ్రిమెంట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటే… న్యాయపరమైన సమస్యలు వస్తాయని హెచ్చరించింది. అలాగే.. ధరలు నిర్ణయం అయ్యే ప్రాసెస్, ఇతర రాష్ట్రాల్లో.. పీపీఏల ధరలు.. ఇలా అన్నింటి వివరణతో.. కేంద్రానికి లేఖలు పంపింది. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి పీపీఏ సంగతి తేల్చాలనే చూస్తున్నారు. దీంతో కంపెనీలు న్యాయపోరాటం దిశగా వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com