అసెంబ్లీ లో చిరంజీవి ప్రస్తావన, రాష్ట్రానికి చిరు ఏం చేశాడో చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నదీ పరివాహక ప్రాంతాల లో నిర్మించిన కట్టడాలను మూసివేయాలని ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ, కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిన వేల కోట్ల నిధుల గురించి కూడా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలతోపాటు, వందల ఏళ్లుగా ఉన్న ప్రైవేటు కట్టడాలు సైతం ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్ వీటిని కూల్చివేస్తామని చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలలో ఆందోళన నెలకొందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రంలో ప్రజా ధనం తో కట్టిన ప్రభుత్వ భవనాలను కూల్చడం ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే గోదావరి నదికి కేవలం 5 మీటర్ల దూరంలో దిండి రిసార్ట్స్ కట్టడానికి అనుమతిని ఇచ్చారని ఎమ్మెల్యే ప్రభుత్వానికి గుర్తు చేశారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక ప్రైవేటు భవనాలు, హోటల్స్ కట్టడానికి రాజశేఖర్రెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారని, ఆ హోటళ్ల పేర్లతో సహా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు.

ఇక అదేవిధంగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, దీంతో మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేశారని, ఆ నిధులతో నే కోవూరు, కోటిపల్లి లాంటి చోట్ల అనేక ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. జగన్ నది పరివాహక ప్రాంతాల్లోని కట్టడాలన్నీ కూల్చివేయాలని అంటే ఇలా వేలకోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ప్రాజెక్టులను కూడా కూల్చివేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

సరైన మీడియా అండ లేకపోవడంతో తాను చేసిన మంచి పనులను కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రానికి ఏం చేశారు అని పదేపదే ప్రశ్నించే రాజకీయ పార్టీలు, వారి ఆధీనంలోని మీడియా చానల్స్ కి, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల లోని ఒక ఎమ్మెల్యే నే సమాధానం ఇచ్చే పరిస్థితి రావడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close