సమీక్ష….ఇస్మార్ట్ శంకర్

తెలుగు360 రేటింగ్ : 3/5

కమర్షియల్ సిన్మా అంటే ఎట్లుండాలె

నేల, బెంచీ నుంచి సీటీలు మార్మోగాలె.

కాగితం ముక్కలు గాల్లోకి ఎగరాలె..

ఈ గడబిడ అంతా చూసి సైలంట్ గా సిన్మా చూసెటోళ్లు, కిందా మీదా గావాలె.

ఈ తరహా సినిమాలు వేరు. అదో టైపు.

అలా అని అవి అందరికీ నచ్చి చావవు.

ఇలాంటి సినిమాల కోసం క్యూ కట్టే వాళ్లు వేరుగా వుంటారు. వాళ్ల కోసమే, అచ్చంగా వాళ్ల కోసమే ఇస్మార్ట్ శంకర్.

దర్శకుడు పూరి జగన్నాధ్ బలం ఎక్కడ వుందో, ఆ బలాన్ని పక్కాగా పేర్చుకుంటూ వెళ్లిన సినిమా ఇస్మార్ట్ శంకర్.

ఫైరింగ్ యాక్షన్ సీన్లు, హీరో యాటిట్యూడ్ ప్లస్ డైలాగులు, హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ ఈ మూడు రకాల సీన్లను వన్, టు, త్రీ అంటూ రైమింగ్ గా పేర్చుకుంటూ వెళ్లి, వాటిని కథ అనే థ్రెడ్ తో కలిపిన సినిమా ఇస్మార్ట్ శంకర్.

ఉస్తాద్ శంకర్ (రామ్) ఓ పెయిడ్ కిల్లర్. కాశీవిశ్వనాధ్ అనే మాజీ ముఖ్యమంత్రిని చంపిన కేసులో జైలుకు వెళ్తాడు. కానీ తప్పించుకు వచ్చి, తను జైలుకు వెళ్లడానికి కారణమైన వాడి కోసం వెదుకుతుంటాడు. ఇదిలా వుంటే అరుణ్ (సత్యదేవ్) అనే సిబిఐ అధికారి కాల్పుల్లో మరణిస్తాడు. కానీ అతని దగ్గర కీలకమైన సమాచారం వుండిపోతుంది. ఆ సమాచారం తెలుసుకోవడం కోసం న్యూరో సైంటిస్ట్ సారా(నిధి అగర్వాల్), అరుణ్ మెదడులోని జ్ఞాపకాలను చిప్ రూపంలోకి మార్చి, శంకర్ మెదడులో ఇన్ సెర్ట్ చేస్తుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కథ, లాజిక్ లు లాంటి వ్యవహారాల కన్నా, మాస్ మసాలా టేకింగ్ కు ఎక్కువ మార్కులు పడతాయి. పూరి జగన్నాధ్ మాస్ టేకింగ్ పవర్ ఈ సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంది. మామూలుగానే పూరి స్టయిల్ హీరోలు డిఫరెంట్ గా వుంటారు. అలాంటిది రామ్ లాంటి ఫుల్ ఎనర్జీ వున్న స్టార్ దొరికితే పూరి ఎలా చూపిస్తాడు అన్నది తెలియాలంటే ఇస్మార్ట్ శంకర్ లో చూడాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ కు జనం ఓకె అంటారు అంటే దానికి తొలికారణం రామ్ నే.

ఇన్నాళ్లు చూసిన రామ్ వేరు, పూరి సినిమాలో కనిపించిన శంకర్ వేరు. శంకర్ గా రామ్ అంతలా పరకాయ ప్రవేశం చేసాడు. ఇదే సినిమాకు కీలకమైన ప్లస్ పాయింట్. మాట, ఆటిట్యూడ్, చూపులు ఇలా ప్రతి ఒక్కటీ కలిసి కొత్త రామ్ ను తెరమీద ప్రెజెంట్ చేసాయి. అది మాస్ జనాలకు భయంకరంగా పట్టేస్తుంది. దీనికి పూరి మార్కు డైలాగులు అదనపు బలం. తెలంగాణ కుర్రకారే కాదు, మాస్ జనాలు కూడా విజిల్ వేసి, గోల చేసేలా డైలాగులు రాసుకున్నాడు.

కేవలం ఇక్కడితో ఆగిపోకుండా, హీరోయిన్లను కూడా సినిమాకు బాగా ఉపయోగపడేలా చూడాలని పూరి డిసైడ్ అయినట్లుంది. నభా నటేష్ అందాలను తెరమీద ఎంత మేరకు పరచగలరో అంతా పరిచారు. ఆమె కూడా అస్సలు మొహమాటపడలేదు. ఏ దుస్తులు ఇస్తే అవే వేసుకుంది. హీరో తన శరీరాన్ని ఎంత సేపు నిమిరినా ఓకె అంది. ఏం చేసినా సరే అంది.

ఎప్పడైతే హీరో, హీరోయిన్లను ఇలా వాడేసారో, మాస్ సినిమాకు కావాల్సిన కీలక దినుసులు వచ్చేసాయి. ఇక మిగిలింది యాక్షన్ సీన్లు. ఈ విషయంలో కూడా పూరికి పేటెంట్ వుంది. పోకిరి స్టయిల్ లో పాడుపడ్డ బిల్డింగ్ లు, కోటల గోడల మాటున దాగి గన్స్ ను భయంకరంగా వాడే సీన్లు. ఇస్మార్ట్ శంకర్ లో హీరో, హీరోయిన్ల తరువాత థర్డ్ ఎలిమెంట్ గా ఇది వాడారు.

సినిమా తొలిసగం ఓ మాస్ సినిమాగా ఎక్కడా వంకపెట్టలేనంతగా సాగుతుంది. పూరి ఈజ్ బ్యాక్ అనే ఫ్యాన్స్ మాటలు నిజమే అనిపించేలా వుంటుంది తొలిసగం. రామ్ ఎనర్జీ, పాటలు, డ్యాన్స్ లు, హీరోయిన్ అన్నీ కలిసి, ఓకె అని అనిపించేస్తాయి. ట్విస్ట్ తో కట్ చేసి, ద్వితీయార్థం మొదలు పెట్టిన తరువాత ముందు చెప్పుకున్నట్లు 1.2,3 టైపు సీన్లు తప్ప, మరేం చేయడానికి దర్శకుడు పూరికి అవకాశం లేకపోయింది. అందుకే పూరి ఓ తెలివైన పని చేసారు. తొలిసగంలో రామ్-నభాల మీద తీసి, చూపించగా మిగిలిన సీన్లు అవసరం అయినపుడల్లా ప్యాచ్ చేసుకుంటూ వెళ్లారు.

ఆవారా, కిల్లర్ అయిన హీరో లవ్ విషయంలో మాత్రం సిన్సియర్ అని చూపించాలని అనుకోవడం వల్ల, రెండో హీరోయిన్ నిధి అగర్వాల్ ను పెద్దగా స్క్రీన్ మీదకు తీసుకురావడానికి కుదరలేదు. అందువల్ల మళ్లీ అవసరం అయినపుడల్లా నభా నటేష్ నే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి వ్యవహారానికి తోడు, కథలో బలం కాస్త తగ్గడం వల్ల, తొలిసగంతో పోల్చుకుంటే మలిసగం కాస్త వీక్ అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏమిటంటే, టోటల్ మర్డర్ ప్లాట్ విషయంలో కాస్త బలమైన ట్విస్ట్ పెట్టి, దాన్ని మొదటి నుంచి ఏదో వుంది అనే విధంగా ఎస్టాబ్లిష్ చేసి వుంటే, బలమైన విలనీ కూడా సినిమాలో వుంది అని అనిపించేది. చివరి వరకు మన చూస్తున్న మనిషి సిఎమ్ అని కూడా జనాలకు తెలియదు.

సినిమాలో ఈ మైనస్ ల సంగతి అలా వుంచితే, పక్కా మాస్ మసాలా ఎలిమెంట్ల వల్ల పైసా వసూల్ సినిమా అవుతుంది కానీ భయపడాల్సిన సినిమాగా మిగలదు.

సినిమాకు దర్శకుడు పూరి కి భలే హీరో దొరికాడు అన్నట్లుగా రామ్ నటించాడు. మెప్పించాడు. హీరోయిన్లలో నిధి పెద్దగా చేసిందీ లేదు చేయందీ లేదు అన్నట్లు వుంది. నభా నటేష్ ఇలాంటి పాత్రలకు పనికి వస్తాను అని చెప్పినట్లు వుంది. మిగిలిన వారి గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు.

పూరి సినిమాలు ఎలా తీసినా, కాస్త మంచి లుక్ తోనే వుంటాయి. ఎందుకంటే ఆయన తీసుకునే నాచురల్ లొకేషన్లు అలా వుంటాయి. కెమేరా బ్లాక్ లు కూడా అలాగే వుంటాయి. మణిశర్మ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సినిమాకు ప్లస్. పాటలు ఒకె. పూరి జగన్నాధ్ తన దగ్గర ఇంకా ఫుల్ ఫైర్ వుందని, మాటలు, పాటలు, ఫైట్లతో చూపించారు. కానీ కథ మీద తనకు కసరత్తు చేయడం అంటే కాస్త బద్దకమని కూడా మరోసారి నిరూపించారు.

ఫినిషింగ్ టచ్…..ఇట్స్ మాస్ శంకర్

తెలుగు360 రేటింగ్ : 3/5

–శ్రీవత్స

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close