షూటింగ్ అని న‌మ్మించి.. నిజం పెళ్లి చేసుకొన్నారు

సిద్దార్థ్ – అతిథిరావు హైద‌రీ పెళ్లి చేసేసుకొన్నారు. వారి ప్రేమ బంధం.. పెళ్లితో బ‌ల‌ప‌డింది. వీరిద్ద‌రూ ఎప్పుడో ఒక‌ప్పుడు ఇలాంటి స్వీట్ షాక్ ఇస్తార‌ని అనుకొంటూనే ఉన్నారు. అదే నిజం చేశారు. అయితే…. ఈ పెళ్లి అత్యంత ర‌హ‌స్యంగా, సినిమాటిక్ ప‌ద్ధ‌తిలో సాగిన ప‌ద్ధతే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బుధ‌వారం వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీ‌రంగాపూర్‌లోని రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యంలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకొన్నారు. అక్క‌డే ఎందుకంటే.. అతిథిరావుది వ‌న‌పర్తి సంస్థాన‌మే. రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యం వాళ్ల పూర్వీకులు క‌ట్టించింది. అక్క‌డ పెళ్లి చేసుకొంటే అంతా శుభమే జ‌రుగుతుంద‌ని అతిథిరావు భావించింది. పెళ్లి తంతు సింపుల్ గా సాగినా, అక్క‌డ చాలా డ్రామా నడిచింది.

తొలుత అక్క‌డ క్యార్ వ్యాన్లు చేరుకొన్నాయి. కెమెరాలు దిగాయి. అక్క‌డేదో షూటింగ్ జ‌రుగుతోంద‌న్న భ్ర‌మ క‌ల్పించి, ఆ ఆల‌యాన్ని ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆల‌యంలో నిత్యం పూజ‌లు చేసే పూజారుల‌కు సైతం లోప‌ల‌కు అనుమ‌తి ల‌భించ‌లేదు. ఈ పెళ్లి తంతు కూడా చెన్నై నుంచి పిలిపించుకొన్న పూజారులే పూర్తి చేశారు. ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం ప‌ది గంట‌ల‌క‌ల్లా పూర్త‌య్యింది. కేవ‌లం 30 నుంచి 40 మంది మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. సాయింత్రం అదే ఊర్లో చిన్న విందు కూడా ఏర్పాటు చేసింది కొత్త జంట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close