చ‌ర‌ణ్ సినిమా.. మూడు పాట‌లు రెడీ!

రామ్ చ‌ర‌ణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. చ‌ర‌ణ్ కు ఇది 16వ చిత్రం. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌. ఈ సినిమా కోసం రెహ‌మాన్ స్వ‌రాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ చిత్రానికి రెహ‌మాన్ ప‌ని చేయ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే మూడు పాట‌లు రెడీ అయిపోయాయి. రెహ‌మాన్ పాట‌లతోనే బ్లాస్ట్ మొద‌లు కాబోతోంద‌ని ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే వార్త చెప్పేశారు. చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. అక్క‌డే.. బుచ్చిబాబు ఈ `మెగా లీక్‌` చేసేశారు.

బుచ్చిబాబు తొలి సినిమా ‘ఉప్పెన‌’. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అస‌లు పాట‌ల వ‌ల్లే ఈ సినిమాకు హైప్ వ‌చ్చింది. పైగా ఇది సుకుమార్ రైటింగ్స్ లో వ‌స్తున్న సినిమా. సుకుమార్ అంటేనే దేవిశ్రీ ప్ర‌సాద్‌. వీరిద్ద‌రిదీ `ఆత్మ‌` బంధం. ఈ విష‌యం కూడా సుకుమార్ చాలా సార్లు చెప్పారు. అలాంటిది.. సుకుమార్ రైటింగ్స్ లో, సుకుమార్ శిష్యుడు తీస్తున్న సినిమాలో దేవిశ్రీ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. కాక‌పోతే చ‌ర‌ణ్ సినిమాకున్న స్పాన్ ని దృష్టిలో ఉంచుకొని రెహ‌మాన్ వ‌ర‌కూ వెళ్లాల్సివ‌చ్చింది. రెహ‌మాన్ నుంచి ఓ సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్ వ‌చ్చి చాలా కాలమైంది. ఆ లోటు… చ‌ర‌ణ్ సినిమా తీరుస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close