ఎక్ల్‌క్లూజీవ్‌: సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ‘జాక్‌’

‘డీజే టిల్లు’తో సూప‌ర్ హిట్ కొట్టి, యంగ్ హీరోల రేసులోకి ముందుకొచ్చాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. త‌న నుంచి ఓ ప్రాజెక్ట్ వ‌స్తోందంటే.. అంద‌రి దృష్టీ అటువైపే ప‌డుతోంది. ‘టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్‌’ విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఈలోగా మ‌రో ప్రాజెక్ట్ ని సెట్ చేసేశాడు. ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సిద్దు హీరోగా ఇటీవ‌లే ఓ సినిమా ప‌ట్టాలెక్కింది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ‘బేబీ’తో ఆక‌ట్టుకొన్న వైష్ణ‌వి హీరోయిన్‌. ఈ చిత్రానికి ‘జాక్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. రేపు చిత్ర‌బృందం అధికారికంగా ఈ టైటిల్ ని ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్ అన‌గానే కుటుంబ క‌థా చిత్రాలు, ల‌వ్ స్టోరీలు గుర్తొస్తాయి. అయితే ఈ సినిమా మాత్రం వాటికి భిన్నంగా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఫ‌న్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఈ క‌థ‌లో మేళ‌వించిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close