పాపం… ‘అయ‌లాన్’

త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. త‌న ‘వ‌రుణ్ డాక్ట‌ర్‌’ తెలుగులో మంచి వసూళ్ల‌ని రాబ‌ట్టింది. ‘ప్రిన్స్‌’ స్ట్ర‌యిట్ తెలుగు సినిమా స్థాయిలో విడుద‌లైంది. శివ కార్తికేయ‌న్ సినిమా వ‌స్తోందంటే ఇక్క‌డ అటెన్ష‌న్ చూపిస్తారు. అలాంటిది త‌న తాజా చిత్రం ‘అయ‌లాన్’ తెలుగు రిలీజ్‌కు నోచుకోక‌పోవడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. శివ కార్తికేయ‌న్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా త‌మిళంలో విడుద‌లైంది. ఆ స‌మ‌యంలో డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌ల చేసేందుకు తెలుగు నిర్మాత‌లు అంగీక‌రించలేదు. దాంతో జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌కు ముస్తాబైంది. తెలుగులో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా నిర్వ‌హించారు. మీడియాకు శివ కార్తికేయ‌న్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. కానీ జ‌న‌వ‌రి 26న ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో ఆగిపోయింది. థియేట‌ర్ల ద‌గ్గ‌ర టికెట్లు అమ్మి, డ‌బ్బులు వాప‌స్ ఇచ్చేశారు.

ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా తెలుగు రిలీజ్‌కు దూర‌మైంది. ఈనెల 9న నేరుగా ఓటీటీలో విడుద‌ల అవుతోంది. స‌న్ నెట్ వ‌ర్క్ లో.. ఈ సినిమా చూడొచ్చు. త‌మిళంలో ఈ సినిమాకు అంతంత మాత్రంగానే ఆద‌ర‌ణ ద‌క్కింది. తెలుగులో ఆల‌స్యంగా రిలీజ్ చేయ‌డం, టాక్ తెలుసిపోవ‌డంతో బ‌జ్ త‌గ్గిపోయింది. విడుద‌ల చేద్దామ‌ని బ‌రిలోకి దిగినా, ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడాయి. దాంతో.. తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయ‌కుండానే ఓటీటీలోకి దింపేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close