విజ‌య్ చివ‌రి సినిమా.. డిటైల్స్ ఇవే!

త‌మిళ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టారు. రాబోయే త‌మిళ నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌బోతున్నారు. ఈలోగా చేతిలో ఉన్న ‘గోట్‌’తో పాటు మ‌రో సినిమానీ పూర్తి చేయాల‌న్న‌ది విజ‌య్ ప్లాన్. ఒక‌సారి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన త‌ర‌వాత ఆయ‌న పూర్తిగా సినిమాల‌కు దూరం అయిపోవొచ్చు. అందుకే విజ‌య్ చివ‌రి సినిమా ఏమై ఉంటుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త రెండు నెల‌లుగా విజ‌య్ ఎన్నో క‌థ‌లు విన్నారు. తెలుగు నుంచి కూడా కొంత‌మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించారు. కానీ ఏదీ ఓకే అవ్వ‌లేదు. ఎట్ట‌కేల‌కు విజయ్ చివ‌రి సినిమాకి ద‌ర్శ‌కుడు ఫిక్స‌యిన‌ట్టు త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

త‌మిళంలో క‌ల్ట్ సినిమాలు తీస్తున్న‌ వెట్రిమార‌న్‌తో విజ‌య్ ఓ సినిమా చేయ‌బోతున్నాడట‌. డీవీవీ దాన‌య్య ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని స‌మాచారం. ఇదో పొలిటిక‌ల్ డ్రామా అని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు త‌న ఇమేజ్ పెరిగేలా, ఎల‌క్ష‌న్ల‌కు బూస్ట‌ప్ ఇచ్చేలా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. 2025 చివ‌ర్లో గానీ, 2026 సంక్రాంతికి గానీ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసుల సమస్యలు పరిష్కరించాలని జగన్ రెడ్డికి డీజీపీ లేఖ !

అదేంటో ... ఐదేళ్ల వరకూ తమ పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నాయని.. వారి టీఏ, డీఏలు కత్తిరించినప్పుడు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి గుర్తు రాలేదు., ఇప్పుడు ఎన్నికలకు ముందు.. .మరో పది...

నిందితుల కోసం వచ్చిన తెలంగాణ పోలీసులపై కడపలో దాడి

వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసి వచ్చి తమ గ్రామంలో సేఫ్ గా ఉండటం బీహార్ లాంటి రాష్ట్రాల్లో దొంగలు చేస్తూంటారు. అన్నీ తెలుసుకుని ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తే... వారిపై మూకుమ్మడి దాడి...

రాజోలు జనసేన అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె !?

పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్...

కేటీఆర్, హరీష్ రావు పాదయాత్రలు చేస్తారా ?

గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటిపోరు యాత్ర చేపడుతున్నట్లు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి ఈ యాత్ర ఉండనుంది. తెలంగాణలో నీటిపారుదల అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close