దీపావళికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. ఇందులో మిత్రమండలి ఆల్రెడీ వచ్చేసింది. ఆశించన పాజిటివ్ టాక్ అయితే రాలేదు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ డబ్బింగ్ కేటగిరిలోకి వెళ్తుంది. ఇప్పుడు తెలుగు నుంచి వస్తున్న మరో రెండు చిత్రాలు కిరణబ్బవరం కె రాంప్, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా పై అందరి దృష్టి ఉంది.
ఈ రెండు సినిమాలు కూడా దేనికవే ప్రత్యేకం. అయితే కామన్ పాయింట్ సిద్దు కిరణ్ ఇద్దరు పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉంది. కిరణబ్బవరం ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ ఫామ్ ని కొనసాగించడంలో ఎదురు దెబ్బ తగిలింది. క తర్వాత వచ్చిన దిల్ రుబా సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఫామ్ లోకి రావాలంటే కెరాంప్ విజయం తప్పనిసరి. అటు సిద్దు పరిస్థితి కూడా ఇలానే ఉంది.
టిల్లు స్క్వేర్ విజయంతో స్టార్ హీరోగా దూసుకొచ్చిన సిద్దుకి జాక్ లాంటి డిజాస్టర్ పడింది. నిజానికి ఆ సినిమా సిద్దు కెరీర్ పై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుసు కదా తో మళ్లీ ఫామ్ లోకి రావడం సిద్దుకి తప్పనిసరి. తను కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఒక హిట్టు ఆ వెంటనే ఫ్లాప్ తో వున్న కిరణ్, సిద్దు కి ఈ సినిమాలు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని ఎలా సరిచేస్తాయో చూడాలి.