ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గురువారం అనువాద చిత్రం సింగం 3 సందడి చేస్తే, శుక్రవారం నాగార్జున సినిమా ఓం నమో వేంకటేశాయ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం 3కి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మాస్‌కి నచ్చుతుందని, లౌడ్‌గా ఉందని, హెవీ యాక్షన్ సినిమా అని టాక్ వినిపిస్తోంది. రివ్యూలూ అలానే ఉన్నాయి. ఓం నమో వేంకటేశాయకి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చేసింది. నాగ్, రాఘవేంద్రరావులు మరోసారి మ్యాజిక్ చేసేశారని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల వసూళ్లు ఎలా ఉన్నాయి?
సింగం 3కి తెలుగు నాట రెండు రోజులకు కలిపి దాదాపుగా రూ.10 కోట్ల వసూళ్లు దక్కినట్టు సమాచారం. తొలిరోజు దాదాపుగా రూ.6.5 కోట్లు తెచ్చుకొందట. రెండో రోజు సుమారు రూ.4 కోట్ల వరకూ వచ్చినట్టు టాక్. బీ,సీల్లో సింగం హవా ఎక్కువగా ఉందని, శని ఆదివారాల్లో సింగం 3 వసూళ్లు పికప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఓం నమో వేంకటేశాయకి మంచి టాకే వచ్చినా, వసూళ్లు డల్‌గా ఉన్నాయి. శుక్రవారం 50 శాతం ఆక్యుపెన్సీ కనిపించిందని, అయితే… హిట్ టాక్ రావడంతో మెల్లమెల్లగా వసూళ్లు పెరుగుతాయని శని, ఆదివారాల్లో ఆక్యుపెన్సీ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింగం 3 సినిమాని తెలుగు లో రూ.14 కోట్లు వెచ్చించి కొన్నారు. శాటిలైట్ తో కలుపుకొని కాబట్టి.. నిర్మాత గట్టెక్కేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.