పేపర్ లీకేజీ ఆధారాలు ఇవ్వాలని రాజకీయ నేతల్ని అడుగుతున్న సిట్ !

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాజకీయాలకు అతీతంగా వేగంగా దర్యాప్తు చేసి నిజాలను బయట పెట్టి ఉద్యోగార్థుల్లో నమ్మకం పెంచాల్సిన సిట్ .. రాజకీయ నేతలను టార్గెట్ చేసుకోవడంతో సీరియస్ నెస్ తగ్గిపోతోంది. ఏపీ పోలీసుల మాదిరిగా ఆరోపణలు చేసిన రాజకీయ నేతలకు ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డి కేటీఆర్ పీఏ తిరుపతి వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. ఇదంతా కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కావాలంటూ.. సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నోటీసులు రాలేదని.. నోటీసులు అందుకున్న ఆధారాలు ఇచ్చేది లేదని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయిస్తే ఇస్తామన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని TSPSC పేపర్ లీకేజ్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్ తోనే విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక మా పోరాటం కొనసాగుతుందన్నారు. కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినా దుామారం రేగే అవకాశం ఉంది.

విచారణ జరిపే కొద్దీ అసలు లీక్ కాని పరీక్ష పేపర్ ఏదైనా ఉందా అనే డౌట్ అందరికీ వస్తోంది. ఇలాంటి సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిజాలను వెల్లడించాల్సి ఉంది. నిజాయితీగా కష్టపడిన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సి ఉంది. అలా కాకుండా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్న వారి విషయంలో జోక్యం చేసుకుని నోటీసులు జారీ ేచస్తే… విషయం అంతా రాజకీయం అవుతుంది. నిరుద్యోగులు అన్యాయమైపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close