ఆంధ్ర లిక్కర్ స్కామ్‌లో జగన్ రెడ్డి అంతిమ లబ్దిదారు అని సిట్ గుర్తించింది. ఆయనకు సొమ్ము ఎలా చేరిందో కూడా వివరాలు బయటకు లాగింది. వైఎస్ జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసే సోదరుడు అనిల్ రెడ్డి.. ద్వారా మొత్తం సొమ్ము జగన్ కు చేరింది. రాజ్ కేసిరెడ్డి సహాఇతరుల నుంచి అనిల్ రెడ్డి వసూలు చేసేవారు. అనిల్ రెడ్డి వాటిని జగన్ రెడ్డి ఖాతాల్లో చేర్చేవారు.అది నగదా..బంగారమా..షెల్ కంపెనీల పెట్టుబడులా అన్నది ఇప్పుడు సిట్ బయటకు తీస్తోంది. అనిల్ రెడ్డి దగ్గర పీఏగా పని చేస్తున్న దేవరాజు అనే వ్యక్తిని సిట్ మూడు రోజులుగా ప్రశ్నిస్తోంది.
తుది దశకు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు !
లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును సిట్ చివరి స్టేజ్‌కు తీసుకు వస్తుంది. అంతిమ లబ్దిదారును గుర్తించి అరెస్టు చేస్తే.. కేసు పూర్తి అవుతుంది. తుది చార్జిషీటును దాఖలు చేసే అవకాశం ఉంది. దేవరాజు ను మూడు రోజులుగా ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. పూర్తి సమాచారం ఇప్పటికే సిట్ సేకరించడంతో ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో దేవరాజులు అన్ని విషయాలు బయటపెట్టినట్లుగా చెబుతున్నారు. అనిల్ రెడ్డి పీఏ దేవరాజు రెగ్యులర్ గా రాజ్ కేసిరెడ్డితో పాటు ఇతర వ్యక్తులతో టచ్ లో ఉండేవారు. వాటా ప్రకారం రావాల్సిన వాటి లెక్కలను చూసుకునేవాడు.
అనిల్ రెడ్డి పీఏ దేవరాజు అన్నీ డీటైల్స్ ఇచ్చేసినట్లే !
దేవరాజులను ప్రశ్నిస్తున్న విషయం బయటకు రాలేదు. మూడు రోజుల తర్వాతనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాడేపల్లి ప్యాలెస్ కు సమాచారం తెలిసిపోవడంతో రెండు రోజుల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గగ్గోలు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ జరగలేదని.. జూనియర్ ఎన్టీఆర్ మామ అని కథలు చెబుతున్నారు. సిట్ కేసును ఆషామాషీగా చేయడం లేదని.. అంతా పక్కాగా దర్యాప్తు చేస్తోందని తెలిసిన తర్వాత వైసీపీ నేతలకు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది.
సూత్రధారి అరెస్టుతో కేసు క్లైమాక్స్‌కు !
లిక్కర్ కేసులో సిట్ అధికారులు మొదట అరెస్టులకు ప్రాధాన్యమివ్వలేదు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత ఆరేడు నెలల పాటు బ్యాక్ గ్రౌండ్ లో విచారణ జరిపారు. ఆధారాలన్నీ సేకరించారు. మనీ రూటింగ్ ఎలా జరిగిందో మొత్తం కనిపెట్టారు. ఆ తర్వాతే అరెస్టులు ప్రారంభించి.. తమ ఆధారాలను అధికారికంగా ధృవీకిరించుకుంటున్నారు. ఇప్పుడు అది ఫైనల్ కు వచ్చింది. సూత్రధారిని అరెస్టు చేయడంతో కేసు క్లైమాక్స్ కు వచ్చే అవకాశం ఉంది.