ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి నివసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతితో పాటు హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయా నగరాల్లోని పీఎల్ఆర్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎక్కువ మొత్తం నగదు.. పీఎల్ఆర్ కంపెనీల ద్వారానే వైట్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి.
గతంలో ఐదు కోట్ల రూపాయలను ఇలా ఓ సూట్ కేసు కంపెనీ పేరుతో తమ కంపెనీలోకి మళ్లించుకున్న పీఎల్ఆర్ సంస్థ .. వివరాలు వెల్లడికావడంతోనే మిథున్ రెడ్డిని ఈ కేసులో చేర్చారు. ఎంపీగాఉన్న మిథున్ రెడ్డి వైసీపీ హయాంలో ప్రతి శనివారం తాడేపల్లికి వచ్చి లిక్కర్ లెక్కలు చెప్పేవారని వైసీపీలో బహిరంగంగానే చెప్పుకుంటూ ఉంటారు. మొత్తం కలెక్షన్లు, ఆయన కనుసన్నల్లోనే జరిగాయని అంటారు. ఇందులో ఆయనకు లభించాల్సిన కమిషన్ లభించిందని సిట్ చెబుతోంది.
అయితే అనూహ్యంగా జగన్ రెడ్డి ఆయనను దూరం పెడుతున్నారు. అరెస్టు అయిన తర్వాత కానీ.. విడుదల అయిన తర్వాత కానీ పరామర్శించలేదు. తన మెడకు ఎక్కడ చూడతారోనన్న భయంతోనే జగన్ రెడ్డి .., పెద్దిరెడ్డి కుటుంబాన్ని దూరం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.