సోష‌ల్ మీడియాలో ‘సీతారామం’ జ‌పం

ఓ సినిమాని సినిమావాళ్లో, సినీ విశ్లేష‌కులో, ట్రేడ్ పండితులో మెచ్చుకుంటే సరిపోవ‌డం లేదు. సోష‌ల్ మీడియాలోనూ పాజిటీవ్ రివ్యూ రావాల్సిందే. ఎందుకంటే… సోష‌ల్ మీడియా ప్ర‌భావ‌మే జనాల‌పై ఎక్కువ‌గా ప‌డుతోంది. వాళ్ల‌కా… ఏ సినిమా పూర్తిస్థాయిలో న‌చ్చ‌దు. అన్ని కోణాల్లోనూ సినిమానీ పోస్ట్ మార్ట‌మ్ చేస్తున్నారు. సినిమా తేడా కొట్టిందా – మీమ్స్‌తో చెల‌రేగిపోతున్నారు. చిన్న చిన్న త‌ప్పుల్ని కూడా భ‌లే ప‌ట్టేస్తున్నారు. బాక్సాఫీసు దుమ్ము దులిపిన సినిమాలకీ వంక‌లు పెడుతున్నారు. సోష‌ల్ మీడియా అంతా నెత్తిన పెట్టుకొన్న సినిమా ఈ మ‌ధ్య రాలేదు. ఇప్పుడు ఆ లోటు `సీతారామం` తీర్చింది.

ఈ సినిమా గురించి సోష‌ల్ మీడియా పూర్తి పాజిటీవ్ కోణంలో స్పందించింది. ఎవ‌రు కాసినా దీన్నో క్లాసిక్ అంటూ అభివ‌ర్ణిస్తున్నారు. సినీ సెల‌బ్రెటీలు సైతం పాజిటీవ్ ట్వీట్ల‌తో హోరెత్తించారు. ఈ ఫీడ్ బ్యాక్ ప్ర‌భావం వ‌సూళ్ల‌పై ప‌డింది. శుక్ర‌వారం ఓ మెస్త‌రుగా ఉన్న సీతారామం క‌ల‌క్ష‌న్లు, శ‌నివారం జోరందుకొన్నాయి. శుక్ర‌, శ‌ని వారాల‌తో పోలిస్తే… ఆదివారం వ‌సూళ్లు రెట్టింప‌య్యాయి. చాలా కాలం త‌ర‌వాత కుటుంబ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం క‌నిపించింది. మాస్ సెంట‌ర్ల‌లోనూ… ఫ్యామిలీ ఆడియ‌న్స్ క‌నిపిస్తున్నారు. ఈమ‌ధ్య టాలీవుడ్ లో క‌ల‌క్ష‌న్లు త‌గ్గ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ మిస్ అవ్వ‌డం. సీతారామం వాళ్ల‌ని బాగానే టార్గెట్ చేసి, థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగింది. కుటుంబ ప్రేక్ష‌కులు మ‌ళ్లీ సినిమా చూడ్డానికి అల‌వాటు ప‌డితే థియేట‌ర్లు మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడ‌డం ప్రారంభం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close