‘సైజ్ జీరో’ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న యూనిట్

ఇండియన్ సినిమా హిస్టరీలోనే విన్నూత రీతిలో ‘సైజ్ జీరో’ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న యూనిట్.

సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధానతారాగణం. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన చిత్రం ‘సైజ్ జీరో’ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం కోసం అనుష్క 20 కిలోలు బరువు పెరిగింది. ఇలాంటి అనుష్క కమిట్ మెంట్ ఈ ఫీల్ గుడ్ కామెడి ఎంటర్ టైనర్ కు మరింత ప్లస్ అయింది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

సినిమా నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. సినిమా విడుదలే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా విన్నూతంగా, భారీగా ఉండేలా పివిపి సంస్థ ప్లాన్ చేసింది. సౌత్ సెంట్రల్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ వెలుపల, బయట సైజ్ జీరో సినిమా సంబంధిత పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా విన్నూత రీతిలో ప్లాన్ చేశారు. దీంతో ట్రెయిన్స్ లో ప్రయాణించే ప్రయాణీకులే కాదు, చూసే వారికి కూడా ‘సైజ్ జీరో’ గురించి అటెన్షన్ ఏర్పడేలా ప్లాన్ చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నవంబర్ 1న విడుదలై సూపర్ సక్సెస్ అయింది. సినిమా ప్రారంభం నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఏర్పడిన అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు, తమిళంలో థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే రెండు మిలియన్స్ వ్యూస్ ను పొందిందంటే సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం అవగతమవుతుంది.

ఒక మంచి ప్రొడక్ట్ కు మంచి ప్రమోషన్స్ అవసరమనే విషయం తెలిసిందే. ఈ విషయం బాగా తెలిసిన పివిపి సంస్థ ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రెయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేశారు. ఇలాంటి విన్నూత ఆలోచనతోనే బ్లాక్ బస్టర్ మూవీ బలుపు సినిమా ప్రమోషన్స్ చేశారు. అలాంటి ఐడియాతోనే విన్నూతంగా సైజ్ జీరో పబ్లిసిటీ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న ఈ సినిమాను గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close