ప్రజాస్వామ్యానికి విష ప్రయోగం

నచ్చజెప్పడం ద్వారా, ఆశ చూపడం ద్వారా, వత్తిడి చేయడం ద్వారా ప్రత్యర్ధులను దారికి తెచ్చుకునే సామ, దాన, భేదోపాయాల రాజకీయ ప్రక్రియలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించే దుష్ట సాంప్రదాయం దండోపాయాన్ని టీఆర్ఎస్ ప్రవేశపెట్టింది.

దాదాగిరితో దందాలు చేసే తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరు.. జగన్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు. సహచరులంతా నచ్చజెప్పి ఆయన్ని పార్టీలోనే వుంచగలిగారు. “హైదరాబాద్ లో మాకు ఆరెకరాల స్ధలం వుంది. దానిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదని నోటీసు ఇవ్వాలా” అని హెచ్చరించారు. జగన్ పార్టీలో చేరి మీ సీటు నుంచే పోటీ చేయండని సలహా ఇచ్చారు” అని ఆ నాయకుడు ఈ పత్రికా రచయితతో అన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఇంతవరకూ చెప్పిన ఆ నాయకుడు అంతకుమించి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

హైదరాబాద్ లో చాలావరకూ స్థిరాస్థుల క్రయవిక్రయాల్లో పూర్వపు దస్తావేజులు, లింక్ డాక్యుమెంట్లు వుండవన్నది బహిరంగ రహస్యమే! మనిషికీ మనిషికీ మధ్య వుండే నమ్మకం మీద లావాదేవీలు నడుస్తూంటాయి. లింక్ డాక్యుమెంట్లు సరిగా లేవు కనుక అది ప్రభుత్వ ఆస్ధి అని స్వాధీనం చేసుకునే సాంకేతికమైన వీలు వున్నది. ఈ నాయకుడు దందా ద్వారానే ఆస్ధి సాధించారు కాబట్టి ఇలాంటి అన్ని ఆస్ధులనూ స్వాధీనం చేసుకుంటున్నాము అని ప్రభుత్వం పారదర్శకంగా చర్యతీసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండకూడదు.

కోర్టు ద్వారా ప్రభుత్వంతో తలపడటమంటే చిన్న విషయం కాదు. మీ ఇష్టమొచ్చినది చేసుకోండి అని ధిక్కరించడానికి అందరూ వల్లభనేని వంశీలో, తోట త్రిమూర్తులో కాలేరు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో పోటీ చేసినట్టే టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడానికి గల హక్కును ఎవరూ తిరస్కరించలేరు. అయితే హైదరాబాద్ లో వున్న ఆస్ధులపై అధికారం కత్తిపెట్టి మేము చెప్పినట్టే రాజకీయాలు చేయాలి అని బెదిరించడం దారుణం. ఈ పనిచేయించడానికే హైదరాబాద్ పాలకులకు ఢిల్లీ ప్రభువులు “ముందస్తు” అనుమతి ఇచ్చారా అన్న అనుమానాలను ప్రస్తుత పరిణామాలు బలపరస్తున్నాయి. “రిటర్న్ గిఫ్ట్” అంటే ముసుగు వేసుకుని చేసే కుట్రేనని అర్ధమైపోతున్నది.

ఈ పరిణామాలకు ముందు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య గెలుపెవ్వరిదో చెప్పలేనంత తీవ్రమైన పోటీ కనబడింది. టీఆర్ఎస్ తెరవెనుక పాత్ర సామాన్యులకు కూడా అర్ధమైపోయే కొద్దీ పరిస్ధితిలో పెద్దమార్పు వచ్చింది.

గతంలో ప్రజల మధ్య వుండే వారికి పార్టీలు టికెట్లు ఇచ్చి వారి ఎన్నికల ఆర్ధిక భారాలను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల మీద మోపేవి. సంపన్నులనే వ్యాపార, పారిశ్రామిక వేత్తలనే అభ్యర్ధులుగా నిలబెట్టే “గెలుపు గుర్రాల” ఎంపిక ట్రెండ్ చంద్రబాబుతోనే మొదలైంది. సామాన్యులు, మధ్యతరగతి వారు పోటీ చేయలేని పరిస్ధితికి బాబు పునాది వేశారు.

ప్రజాస్వామ్యం మీద నమ్మకమూ, గౌరవమూ లేని మోదీ, కేసీఆర్ లు జతకట్టి చేస్తున్న విషప్రయోగం ఫలితం ఆంధ్రప్రదేశ్ మీద పడటం సరే! ఈ ధోరణే అధికారంలో వున్న పార్టీలు కొనసాగిస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా సమాధి అయిపోడానికి ఎన్నో ఏళ్ళు పట్టదు.

ఇది అర్ధమయ్యేకొద్దీ మోదీ, కేసీఆర్ జంటను ప్రజలు చీదరించుకుంటారు. జగన్ జనాలకు దూరమౌతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close