పలాష్ ముశ్చల్, టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానల బంధం పెటాకులైన వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపులు తిరుగుతోంది. కేవలం పెళ్లి రద్దు కావడమే కాకుండా, పలాష్‌పై వచ్చిన తాజా ఆరోపణలు బాలీవుడ్, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడు, నిర్మాత విజ్ఞాన్ మనే సాంగ్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదం మరింత ముదిరింది. నజారియా అనే సినిమా ప్రాజెక్ట్ కోసం పలాష్ తన వద్ద రూ.40 లక్షలు తీసుకుని, పని పూర్తి చేయకుండా మోసం చేశాడని మనే ఆరోపించారు.
ఈ వివాదంలో విజ్ఞాన్ మనే వెల్లడించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 23, 2025న పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో పలాష్ ముశ్చల్ మరొక మహిళతో సన్నిహితంగా ఉండటం తాను చూశానని మనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన స్మృతి మంధాన సహచర మహిళా క్రికెటర్లు, పలాష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ పరిణామాల తర్వాతే మంధాన కుటుంబం పెళ్లిని రద్దు చేసుకున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను పలాష్ ముశ్చల్ తీవ్రంగా ఖండించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆయన, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రని కొట్టిపారేశారు. అక్రమంగా తనపై ఫిర్యాదు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం సాంగ్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు.
2019 నుంచి డేటింగ్లో ఉన్న పలాష్ , మంథాన, గతేడాది డిసెంబర్ 7 నాటికి అధికారికంగా విడిపోయారు. ఆరోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిందని అప్పట్లో భావించినప్పటికీ, తాజా పరిణామాలు చూస్తుంటే అంతకు మించిన వివాదాలే కారణమని తెలుస్తోంది. ఆరాధ్య జంటగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి బంధం ఇలా పోలీసు కేసులు, కొట్లాటల వరకు వెళ్లడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వ్యవహారంలో స్మృతి మంధాన నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.