బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ బ్లాడ్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తే.. దానిని విజయవంతం చేయాలని పిలుపునిస్తే ఇక ఆయనే నాయకుడని చర్చించుకునే వరకూ వెళ్లిపోయింది. ప్రస్తుతం టీటీడీపీలో నారా రోహిత్ అంశం చర్చనీయాశం అవుతోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు.. తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసీమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ…. ఈ క్యాంప్‌ను విజయవంతం చేయాలని వీడియో విడుదల చేశారు.

అంతే.. తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు ఆయన అందుకుంటారంటూ కొంత మంది ప్రచారం ప్రారంభించేశారు. నిజానికి నారా రోహిత్ తాను బ్లడ్ బ్యాంక్‌ ప్రారంభోత్సవానికి వస్తున్నా అని కూడా చెప్పలేదు. టీటీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌ను విజయవంతం చేయమని కోరారు అంతే. దానికి కొంత మంది హడావుడి పడిపోతున్నారు. ప్రస్తుతం టీటీడీపీ నిస్తేజంగా ఉంది. నడిపించే నాయకుడు కరవయ్యాడు. టీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ దూకుడుగా లేరు. దాంతో ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా కొంతమంది లేఖ కూడా రాశారు.

అయితే.. చాలా కాలం నుంచి టీటీడీపీ అధ్యక్ష బాధ్యతల విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. జూఎన్టీఆర్ తీసుకుంటారనే దగ్గర్నుంచి ఎన్టీఆర్, నారా కుటుంబసభ్యుల పేర్లు చాలా ప్రచారంలోకి వచ్చాయి. అయితే టీడీపీ అధినేతవైపు నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రాలేదు. నారా రోహిత్ టీడీపీకి మద్దతుగా చురుగ్గా ఉంటారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఎప్పుడూ చెప్పలేదు. ఒక వేళ వచ్చినా తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెడతారు..?ఈ లాజిక్‌నుమాత్రం కొంత మంది మిస్సయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

HOT NEWS

[X] Close
[X] Close