చైతన్య : వాళ్లకు కత్తి మహేష్‌కు తేడా లేదు..!

కత్తి మహేష్‌కు ప్రమాదం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రకమైన వేవ్ వచ్చింది. కత్తి మహేష్‌కు రిప్ చెబుతూ..వందల పోస్టులు కనిపించాయి. కత్తి మహేష్ ప్రమాద వార్తల కింద కామెంట్లలో అత్యధికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారన్న సానుభూతి కూడా చూపించకుండా దుర్భాషలు ఆడారు. ఆడుతున్నారు. అయితే.. ఎక్కువ మంది ఆయన బతకాలనే కోరుతున్నారు. అది బయటకు చెబుతున్నారా.. మనసులో అదే ఉన్నాదా.. అన్నది ఎవరికీ తెలియదు. కానీ కత్తి మహేష్ విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారాలు.. చేస్తున్న కామెంట్లు చూస్తే.. కత్తి మహేష్ లాగే అందరూ… తమ తమ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తున్నారని అనుకోవాలి.

కత్తి మహేష్.. సెల్ఫ్ మేడ్ మ్యాన్..!

కత్తి మహేష్‌కు ఫేమ్ ఎలా వచ్చింది..? బిగ్ బాస్ వల్ల కాదు. బిగ్‌ బాస్‌ ప్రోగ్రాంలో ఇప్పటి వరకూ జరిగిన సీజన్లలో కంటెస్టెంట్లలోదాదాపుగా అందరూ సెలబ్రిటీలే. నిజానికి కాస్త తరచి చూస్తే.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత మాటీవీ సంస్థ కాంట్రాక్టులిచ్చినప్పటికీ.. అనేక మంది ఫేడవుట్ అయిపోయారు. విన్నర్లుకూడా ఎక్కడున్నారో వెదుక్కోవాల్సిన పరిస్థితి. కానీ అన్ని సీజన్లలో కలిపి ఒక్క కత్తి మహేష్ మాత్రమే ఫేమ్‌లోకి వచ్చాడు.దానికి కారణం బిగ్ బాస్ కాదు.. ఆ పేరుతో వచ్చిన ఫేమ్‌ను అడ్డం పెట్టుకుని… పవన్ కల్యాణ్‌ను.. రాముడ్ని.. తెలుగుదేశం పార్టీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం వల్ల వచ్చిన ఫేమ్. తనకు భావ స్వాతంత్ర్యం ఉందని.. అందరిపై నోరు పారేసుకుని తెచ్చుకున్న ఫేమ్. ఆ క్రమంలో అతను.. గీత దాటారు.

ఫేమ్ కోసం ఎంచుకున్న మార్గంపై భిన్నాభిప్రాయాలు..!

నిజంగా కత్తి మహేష్ అభిప్రాయాలు అహ్వానించదగ్గవే.. చర్చించదగ్గవే..!కానీ ఆయన ఏ పద్దతిలో వాటిని ఎక్స్‌ప్రెస్ చేశారు. సమాజంలో అనేక మందిని నొప్పించడం ద్వారా చర్చకు పెట్టాలని ప్రయత్నం చేశారు. అది తప్పుడు పద్దతి. ఇప్పుడు ఆ పద్దతిలోనే .. తమ భావ స్వాతంత్ర్యాన్ని సోషల్ మీడియాలో వినియోగించుకుంటున్నారు ఇతరు. కత్తి మహేష్ కు జరిగిన ప్రమాదానికి రాముడికి ముడి పెడుడుతన్నారు. తప్పుడు పనులకు శిక్ష అనుభవించాల్సిందేనంటున్నారు. ఇంకా… కత్తి మహేష్ చచ్చిపోవాలని కూడా కోరుకుంటున్నవారున్నారు. అయితే వారందరికీ కత్తి మహేష్ ఫ్యాన్స్.. అనబడే ఓ పార్టీ వారు.. కౌంటర్లు ఇస్తున్నారు. రాముడు హింస కోరుకుంటారా అని ..కొత్త కోణాల్లో వాదిస్తున్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉంది. కత్తి మహేష్‌కు ఎంత ఉందో..అందరికీ అంతే ఉంది.

కత్తి మహేష్‌లాగే ఇతరులకీ భావ ప్రకటనా స్వేచ్చ..!

ప్రస్తుత సమాజంలో వ్యక్తిత్వాల ప్రశ్నే రావడం లేదు. నీ వ్యక్తిత్వం ఇలాంటిదా అని ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కత్తి మహేష్ ..తన వ్యక్తిత్వం అదేనని.. నిర్మోహమాటంగా ప్రకటించుకుని .. చివరికి పవన్ కల్యాణ్‌కు కరోనా వచ్చినప్పుడు కూడా వెటకారంగా మాట్లాడినప్పుడు… ఆయన వ్యక్తిత్వం అదేనని అనుకున్నారు. ఇప్పుడు.. కత్తి మహేష్‌కు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారు అంతే స్పందిస్తున్నారు. కత్తి మహేష్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగానే ఆ స్పందనలు ఉంటున్నాయి. ఎవరి వాదనలు వారివే.ఎవర్నీ తప్పు పట్టలేం.

ఈ దిగజారుడు..మీడియా.. సోషల్ మీడియా వల్లే..!

చివరికి సమాజానికి నువ్వేమి ఇస్తావో.. నీకు సమాజం అదే ఇస్తుందనే నానుడి ఉంది.కత్తి మహేష్ విషయంలో అదే జరుగుతోంది. ఇక్కడ ఎవర్నీ ఎవరు జడ్జ్ చేయలేరు. ఎవరికివారు చేసుకోవాలి. విలువలు నెలకొల్పుకోవాలని ఒకరో.. ఇద్దరో అనుకోవడమే.. వారు మాత్రమే విలువలు పాటించాలి.. మాకు మాత్రం అలాంటిదేమీ లేదని అనుకుంటే… అది దిగజారుడో.. ఎవరు ప్రారంభించారో కానీ.. ఇప్పుడా స్థితికి చేరిపోయాం. దీనికి మీడియా.. సోషల్ మీడియానే బాధ్యులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close