ఏపీకి నాలుగేళ్లలో లక్షల కోట్లిచ్చారట !

ఏపీ బీజేపీ నేతలకు ఏం చెప్పుకోవాలో తెలియడం లేదో.. ఏం చెప్పినా నమ్మరని అనుకుంటున్నారేమో కానీ.. కాకి లెక్కలు చెప్పేస్తున్నారు. విజయవాడలో పదాదికారుల సమావేశం నిర్వహించి… ప్రసంగించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో మూడు లక్షల కోట్లతో రోడ్లు కేంద్రం వేస్తోందని చెబుతున్నారు. అలాగే పోలవరంకు నాలుగేళ్లలో రూ. పదిహేను వేల కోట్లు ఇచ్చిందని కూడా చెబుతున్నారు. అయితే ఇన్ని ఎప్పుడిచ్చారో.. ఏ రికార్డుల్లో ఉందో మాత్రం వారికే తెలియలా. అయితే సోము వీర్రాజు చెప్పినట్లుగా.. లక్షల కోట్ల అప్పులు మాత్రం ఏపీ ప్రభుత్వం లెక్కల్లేకుండా తీసుకోవడంలో సహకరించిందన్న సెటైర్లు పడుతున్నాయి.

పదాదికారుల సమావేశంలో గతంలోలా టీడీపీని విమర్శించలేదు. కానీ వైసీపీ ని మాత్రం టార్గెట్ చేశారు. పండుగల విషయంలో ఇతర పండుగలకు లేని ఆంక్షలు హిందువులు పండుగలకు పెడుతున్నారని.. క్రిస్మస్ వస్తుంటే ఎందుకు ఇటువంటి నిబంధనలు ఉండవనిబీజేపీ నేతలు ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ లో కూడా క్రిస్మస్ పండుగలు చేయించారని మండిపడ్డారు. మైనారిటీ లు, క్రైస్తవులు ను భుజాన ఎక్కించుని హిందువులు ను ఆంక్షల పేరుతో అడ్డంకులు పెడతారా అని తమదైన రాజకీయాలు చేసారు.

మోడీ మళ్లీ 400సీట్లతో గెలుస్తారనే నమ్మకం ప్రజలకు ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ప్రాంతాలలో సభలు నిర్వహించి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. మోడీ ప్రజా పాలన, జగన్ ప్రజా కంఠక పాలన ను వివరిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బిజెపి బలపడుతుందని.. వీధి వీధిన బిజెపి పేరుతో ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. బిజెపి తో పొత్తులు ముడి పెడుతూ ఎవరో ఏదో రాస్తే మేము పట్టించుకోమని.. ప్రకటించారు. మేధావులు తో సమావేశాలు ఏర్పాటు చేసి మోడి ఎపికి చేసిన సాయం గురించి వివరిస్తామన్నారు.

ఫిబ్రవరిలో జరగనున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికకు బిజెపి సిద్దమవుతుందని చెబుతున్నారు. గతంలో టీడీపీ మద్దతుతో విశాఖ నుంచి పోటీ చేసిన మాధవ్ గెలిచారు. ఇప్పుడు టీడీపీ మద్దతు లేకపోతే బీజేపీకి కనీస ఓట్లు వస్తాయో లేదో కూడా డౌటే. అయినా పోటీ చేస్తామని జీవీఎల్ చెబుతున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో ఆయన ఎలాంటి ఖండనలు చేయలేదు. కానీ సొంతంగా బలపడతామని మాత్రం చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close