మోదీని దింపేసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : కేసీఆర్

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని బలవంత పెట్టారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. ఈ విషయాన్ని పెద్దపల్లి జిల్లాలో జరిగిన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభ అనంతరం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం దిక్కుమాలిన ప్రభుత్వం పోయి.. రైతు ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. ఇతర పార్టీలతో ఏమో కానీ రైతు నేతలందరితో కలిసి ఆయన సొంత రైతు పార్టీ పెట్టనున్నట్లుగా కేసీఆర్ మాటలతో అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటి వరకూ కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ విషయంలో .. ముందకూ వెనుక్కూ జరుగుతున్నారు. ఉంటుందా ఉండదా అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ దూకుడు మరింత ఎక్కువ కావడంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. రైతులందర్నీ ఏక తాటిపైకి తెస్తే ప్రభావం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే రైతుల్లో కేంద్రంపై వ్యతిరకేత ఉందని భావిస్తున్నందున ఈ విషయంపై కేసీఆర్ గట్టి ప్రణాళికతో ఉన్నారని చెబుతున్నారు.

ఉచిత విద్యుత్, మీటర్లు లేని విద్యుత్ హామీని కేసీఆర్ ప్రధానంగా ఇవ్వనున్నట్లుగా పెద్దపల్లిలో కేసీఆర్ ప్రసంగం ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేశం మొత్తం రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే రూ. లక్షన్నర కోట్లు కూడా కాదని.. కానీ పది లక్షల కోట్లకుపైగా పెద్దలకు దోచి పెట్టారన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పూర్తిగా డిసైడయినట్లుగా ప్రసంగం సాగింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనా అని అడిగి ప్రజల ఆమోదం తీసుకున్నారు. జిల్లాల పర్యటన అయిపోయినతర్వాత కేసీఆర్ ఇక ఢిల్లీ రైతు పార్టీని ప్రారంభించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close