శివ శంక‌ర్ మాస్ట‌ర్‌కి సోనూ ఆప‌న్న హ‌స్తం

అడ‌గ‌డం ఆల‌స్యం…నేనున్నా అంటూ చేయూత అందించ‌డంలో ముందుంటున్నాడు సోనూసూద్‌. త‌న సాయం పొందిన వాళ్లు వంద‌ల్లో, వేల‌ల్లో ఉన్నారు. `ఫ‌లానా వాళ్లు ఆప‌ద‌లో ఉన్నారు` అంటూ ఓ ట్వీట్ వేస్తే చాలు. త‌క్ష‌ణం సోనూ నుంచి సాయం అందేస్తోంది. ఇప్పుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ విష‌యంలోనూ సోనూ ఇలానే ఉదార‌త చాటాడు. ఆప‌న్న‌హ‌స్తం అందించాడు.

కోవిడ్ తో శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆసుప‌త్రి పాల‌య్యారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. వైద్యానికి చాలా డ‌బ్బులు అవ‌స‌రం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ‌ని ఆదుకోవాల‌ని శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుంటుంబం మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ సంగ‌తి సోనూని తెలిసి, శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. “నేను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతున్నా. ఆయ‌నకు కావ‌ల్సిన స‌హాయం అందించ‌డానికి సిద్ధంగాఉన్నా“ అంటూ సోనూ ట్వీట్ చేశాడు. దాంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆసుప‌త్రి బిల్లుల స‌మ‌స్య దాదాపుగా తొల‌గిపోయిన‌ట్టే. వంద‌లాది చిత్రాల్లో వేలాది పాట‌ల‌కు నృత్య రీతులు స‌మ‌కూర్చారు శివ శంక‌ర్ మాస్ట‌ర్‌. జాతీయ స్థాయిలో అవార్డుకూడా అందుకున్నారు. తెలుగు హీరోల‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధ‌మే ఉంది. వాళ్లంద‌రికంటే ముందు.. సోనూ స్పందించి, ముందుకురావ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close