చైతన్య : హోదా బండెళ్లిపోతోంది ‘చలోరే..చలోరే.. చల్ ‘ సేనాని..!

 

 

 

“చలోరే.. చలోరే .. చల్..” ఈ పాట జనసైనికులకు ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. పాట విన్న ప్రతీసారి పిడికిలి బిగించి.. ఆవేశంతో.. ముని వేళ్ల మీద లేచి నిలబడి భావోద్వేగంతో ఊగిపోయేవాడిని. ఏదైనా చేయాలని.. ఆవేశ పడిపోయేవాడిని. ఇది నా ఒక్కరికే కాదు… జనసైనికులందరిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే.. “చలోరే.. చలోరే .. చల్..” పాటలో ఉన్న ఉద్వేగం కన్నా… పవన్ పై ఉన్న అభిమానంలో ఉండే కరెంటే…ఎక్కువగా ఉంటుంది. అందుకే.. పవన్ కల్యాణ్.. పిడికిలి బిగించి… పోరాటానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చినప్పుడల్లా… జనసైనికుడినన్న ఆత్మవిశ్వాసంతో రెడీ అయిపోయా. కానీ ఇప్పటికీ పోరాటం కాకపోవడమే.. నాకు అసంతృప్తిగా ఉంది.

Also Read .. మార్పు నువ్వు సాధించగలవు పవన్..! by Chaitanya

మీతో పాటు ప్రాణాలర్పించడానికి సిద్ధమే..!

“ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్షకు సిద్ధం” అని జనసేనాని ప్రకటించినప్పుడు… పవన్ పై అంతులేని అభిమానం ఉన్న వారు మాత్రమే కాదు.. ఏపీ కోసం.. పోరాడేవారికి అండగా ఉండాలనుకునే యువతకు కూడా ఓ కిక్ వచ్చింది. అప్పటి వరకూ.. టీడీపీ, వైసీపీ .. రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రత్యేకహోదా అంశాన్ని వాడుకుంటున్నాయి..కాబట్టి.. సాధారణ ప్రజానీకం నుంచి వారి పోరాటానికి పెద్దగా స్పందన లేదు. వారి వారి పార్టీల క్యాడర్ మాత్రమే.. సపోర్ట్ చేశాయి. కానీ పవన్ ఆమరణదీక్ష ప్రకటన తర్వాత యువతలో ఉద్వేగం వచ్చింది  కానీ జనసేనాని.. ఆ ఉద్వేగాన్ని… ఉపయోగించుకోలేకపోయారు. ఆ ఆమరణదీక్ష అనే మాట మళ్లీ రాలేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యేకహోదా ఉద్యమం అనే మాట రాలేదు. అందుకే… జనసైనికునిగా… ఈ విషయంలో నాకు అసంతృప్తిగానే ఉంది.

టీడీపీ, వైసీపీ సరే.. ఏమీ చేయలేకపోతోంది జనసైనికులేనా..? 

ప్రత్యేకహోదా ఆంధ్రుల సెంటిమెంట్ గా మారింది. ఈ విషయంలో.. బీజేపీ ఎంత పట్టుదలగా వ్యవహరించిందో.. ితర పార్టీలు అంతే పట్టుదలగా .. సాధించే పోరాటాలు చేశాయి. నిజం చెప్పాలంటే.. పోరాటాల పేరుతో నాటకాలు ఆడాయి. అంతా రాజకీయమే. వైసీపీ.. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీని పల్లెత్తు మాట అనుకపోయినా.. ఏదో ఓ ప్రోగ్రాం చేశామని అన్నట్లుగా.. కవర్ చేసుకుంది. అప్పుడప్పుడూ సభలు… పార్లమెంట్ ముందు ఆందోళనలు.. ఎంపీలతో రాజీనామాలు చేయించింది. అంతో ఇంతో.. పాపం .. పోరాడిందిలే.. అని సానుభూతి పరులతో అయినా అనిపించుకోగలిగింది. తెలుగుదేశం పార్టీ ఓ రకంగా.. త్యాగాలే చేసింది. బీజేపీతో కటిఫ్ చెప్పి.. మంత్రి పదవుల్ని కూడా వదిలేసుకుని.. ఎన్టీఏపై పోరాడి… సీబీఐ, ఈడీల దాడులకు కూడా బెదరకుండా… పోరాటం చేస్తోంది. అవిశ్వాసం పెట్టి… విపక్షాలందర్నీ కూడగట్టి.. చాలా పెద్ద ప్రయత్నమే చేసింది. రెండు పార్టీలదీ రాజకీయమే. పార్టీలన్నాక చేసేది రాజకీయమే కాబట్టి.. వాళ్లు చేయాల్సింది చేశారు. మరి … ఆమరణ దీక్ష అనే… సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన జనసేనాని తర్వాత ఏం చేశారు. ..? ఏం చేశారో చెప్పుకోవడానికి జనసైనికుల దగ్గర సమాచారం కూడా లేదు.

హోదా ఓపెనింగ్ అడ్వాంటేజ్ ను వాడుకుందాం..!

హోదా పోరాటానికి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఎవరంటే.. వైసీపీ అయినా.. టీడీపీ అయినా చెప్పేది.. పవన్ కల్యాణ్ పేరే. నాడు తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో పెట్టి సభల్లో.. హోదా కోసం పవన్ కల్యాణ్ చేసిన నినాదాలు.. ఇప్పటికీ జనసైనికుల చెవుల్లో మార్మోగిపోతున్నాయి. ఆ ఊపు చూస్తే.. ఇక ఏపీలో తిరుగులేని లీడర్ హోదా పోరాటానికి వచ్చారనే అనుకున్నాం .. కానీ… తీరా చివరికి వచ్చే సరికి… అసలు ఇంత సైలెంట్ గా ఎందుకు ఉండాల్సి వస్తోందనేది.. జనసైనికులకు ఆవేదన కలిగిస్తున్న అంశం. అటు టీడీపీ..ఇటు వైసీపీ.. ఏదో ఓ కార్యక్రమం హోదా కోసం చేసుకుంటూ వెళ్తున్నా… జనసైనికులు మాత్రం కామ్ గా ఉండాల్సి రావడం.. భరించలేని కష్టం. ఒక్కడికి బలం లేదు.. అందరం కలిసి పోరాడదామన్నా… సరే రెడీ అనుకున్న జనసైనికులకు .. ఇప్పటికీ.. పోరాట ఆశ నెరవేరడం లేదు.

క్లైమాక్స్ లో అయినా కొట్టేద్దాం.. చలోరే..చలోరే చల్..!

ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు.. జనసేనాని. సైన్యం అంతా సకల సిద్ధంగా ఉంది. ప్రత్యేకహోదా అంశానికి ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. అందరూ.. తలా ఓ కార్యక్రమం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికైనా.. పాత ప్రణాళికలైనా.. కొత్త ప్లాన్లైనా… జనసేనానితో కలిసి అడుగేసేందుకు.. సైన్యం సకల సిద్ధంగా ఉంది. యుద్ధానికి బరి రెడీ చేసి పోరాటానికి.. ” చలోరే.. చలోరే.. చల్ ..” అని పిలుపునివ్వడమే ఆలస్యం. మేమంతా రెడీగా ఉన్నాం..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close