బ‌న్నీ బ‌ర్త్డే గిఫ్ట్ అదేనా?!

ఏప్రిల్ 7న‌.. అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ కొత్త సినిమా విశేషాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ‘పుష్ష 2’ సెట్లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. ఆ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ని బ‌న్నీ బ‌ర్త్ డే కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే టీజ‌ర్‌కి సంబంధించిన ఎడిటింగ్ పూర్త‌యింద‌ట‌. ప్ర‌స్తుతం దేవిశ్రీ ప్ర‌సాద్ ఆర్‌.ఆర్ ఇచ్చే ప‌నిలో నిగ‌మ్న‌మ‌య్యార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. బ‌న్నీ కొత్త సినిమాల విశేషాలు కూడా అదే రోజున వెల్ల‌డి చేయ‌నున్నారు. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. దానికి సంబంధించిన అప్ డేట్ కూడా అదే రోజున రాబోతోంది. అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ల‌లో సినిమాలు రూపుదిద్దుకోబోతున్నాయి. వీటిలో ముందుగా ప‌ట్టాలెక్కే సినిమా ఏద‌న్న విష‌యంలో బ‌న్నీ బ‌ర్త్ డే రోజునే ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ‘పుష్ష 2’ని ఆగ‌స్టు 15న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఆరోజు ఈ సినిమా రావ‌డం అనుమాన‌మే అనేది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్. అయితే.. చిత్ర‌బృందం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆగ‌స్టు 15నే తీసుకురావాల‌ని కంక‌ణం క‌ట్టుకొంది. అందుకే మూడు షిఫ్ట్‌ల‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మ‌రోవైపు… ఎడిటింగ్ వ‌ర్క్ కూడా సూప‌ర్ స్పీడులో జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close