చేరికలు కాంగ్రెస్‌కు ప్లస్ కాదు – సవాల్ కూడా !

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కమ్ సీఎంగా డబుల్ రోల్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ స్థీరీకరణ అనే కాన్సెప్ట్ ను ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేరికల కోసం గేట్లు ఎత్తారు. తాము గేట్లు ఎత్తామని ప్రకటించిన వెంటనే పోలోమంటూ పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు. వారికి ఎంపీలు, ఎంపీ అభ్యర్థులే కాదు.. భవిష్యత్ లో పార్టీలో పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ ప దవులు.. ఇంకా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేరే వారు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి నేతలే రేవంత్ రెడ్డికి అతి పెద్ద సవాల్.

చేరుతున్న వారంతా కాంగ్రెస్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన వారే !

తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం .. ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కాగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే. ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తగానే పోలోమంటూ ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. బీఆర్ఎస్ అధినేత వద్ద ఉన్న అలుసును ఆసరాగా చేసుకుని.. వారు చేసిన వ్యవహారాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. నిజానికి ఇదే అతి పెద్ద సమస్య. ఇప్పుడు గేట్లు ఎత్తి ఈ సమస్యను తన నెత్తి మీద వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వారి ఫలం వలస నేతలు కొట్టేస్తారా ?

అంతే కాదు పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు.. అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలి పెట్టని వారు ఉన్నారు. వారిలో చాలా మంది గ్రామ, మండల స్థాయిలోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదని అనుకోవడమే. అది నిజం కూడా. ఇప్పుడు .. బీఆర్ఎస్ నేతలంతా పోలోమని కాంగ్రెస్ లోకి వస్తే.. మరి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందర్నీ గుర్తిస్తామని రేవంత్ చెబుతున్నారు. కానీ అది మాటల్లో అంత తేలిక కాదు. పాతిక మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. మరి వారి మీద పోటీ చేసి ఓడిపోయిన వారి సంగతేంటి ?. వారు పార్టీకి లాయల్ గా ఎలా ఉండగలరు ?

వాళ్లెవరూ బీఆర్ఎస్‌ను గెలిపించలేదని గుర్తుంచుకుంటే చాలు !

చేరుతున్న వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేదు. గతంలో బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచిందంటే… అది పూర్తిగా సెంటిమెంట్ మహిమ. అప్పట్లో అభ్యర్థి ఎవరు అన్నది కాదు.. కారు గుర్తు ఉన్నదా లేదా అన్నది చూసుకుని ఓట్లేశారు జనం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ కారు గుర్తు నేతలు ఎప్పుడూ ఆ పార్టీని గెలిపించలేదు. గెలిచి చూపించిన కాంగ్రెస్ పార్టీకి వారు చేసేదేమీ ఉండదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు. ఈ వ్యూహంతో తమ కుంపటికి నిప్పుపెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close