హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణలో తెలుగుదేశంపార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. మోత్కుపల్లి బుధవారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వైఖరి వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలమధ్య భారత్-పాకిస్తాన్ లాంటి పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వాన్ని కేసీఆర్ సొంత ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులు కేసీఆర్పై తిరగబడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్కు గుణపాఠం తప్పదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మైండ్ గేమ్ ప్రజలకు అర్థమయిందని చెప్పారు. కేసీఆర్ తీసుకొచ్చేది బంగారు తెలంగాణ కాదని, భ్రష్ఠు పట్టించే తెలంగాణ అని మోత్కుపల్లి అన్నారు.