స్పైడ‌ర్ ఫ‌స్ట్ లుక్‌… క్లాసీ ట‌చ్‌

హ‌మ్మ‌య్య‌… మహేష్ బాబు అభిమానుల నిరీక్ష‌ణకు తెర‌ప‌డింది. మురుగ‌దాస్ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.సినిమా పేరు కూడా ఖ‌రారైపోయింది. అదే.. ‘స్పైడ‌ర్‌’. ఫార్మ‌ల్ డ్ర‌స్సులో,ట‌క్కూ, టై వేసుకొని మ‌హేష్ లుక్ సింపుల్‌గా క్లాసీ ట‌చ్‌తో ఉంది. స్పైడ‌ర్‌లోగోని తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా ఇంగ్లీష్ లో డిజైన్ చేశారు. ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ లుక్ `ఓకే` అనిపించే స్థాయిలో ఉంది. అయితే.. మురుగ‌దాస్ స్థాయిలో మాత్రం లేద‌న్న‌ది వాస్త‌వం. అంతేకాదు.. ఈమాత్రం దానికా ఇన్ని రోజులు నిరీక్షించింది అనిపిస్తోంది ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే. మురుగ‌దాస్ ఫ‌స్ట్ లుక్ కోసం చాలా క‌స‌రత్తులు చేశాడ‌ని, ఫ‌స్ట్ లుక్ తోనే క‌థ చూచాయిగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని, ర‌క‌ర‌కాల లోగోలు డిజైన్ చేస్తున్నాడ‌ని, ఫ‌స్ట్ లుక్ అదిరిపోయే స్థాయిలో ఉంటుంద‌ని ఊహాగానాలు వినిపించాయి. ”ఏదో ఫ‌స్ట్ లుక్ ఒక‌టి విడుద‌ల చేసేస్తే.. అభిమానుల నుంచి ఒత్తిడి త‌గ్గుతుందిలే” అనుకొని… ఈ లుక్ విడుద‌ల చేసి, చేతులు దులుపుకొన్నాడా అనిపిస్తోంది. మ‌హేష్ ఫ్యాన్స్ ఈ లుక్‌తో సంతృప్తి ప‌డిపోతారా? లేదంటే మురుగ‌దాస్‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డ‌తారా??

ఇక ఈ సినిమా అప్ డేట్ విష‌యానికొస్తే.. రెండు పాట‌ల మిన‌హా షూటింగ్ పూర్త‌యిపోయింద‌ట‌. జూన్ 23న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com