ఇక రోజు వారీగా పెట్రో ధ‌ర‌లు

పెట్రోలు లీట‌రు 75 రూపాయ‌లనుకుని జేబులో ఓ 150 రూపాయ‌లు పెట్టుకుని బంకుకు వెళ్ళ‌డం ఇక కుద‌ర‌దు. ఎందుకంటే మే ఒక‌టో తేదీనుంచి పెట్రోలు ధ‌ర‌లు రోజూ మార‌తాయ‌ట‌. అంత‌ర్జాతీయ చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అనుస‌రించ‌బోతున్నార‌ట‌. కంగారు ప‌డ‌కండి. దేశంలోని ఐదు న‌గ‌రాల‌లో తొలుత దీనిని ప్ర‌వేశ‌పెడ‌తారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని వైజాగ్‌, రాజ‌స్థాన్‌లోని ఉద‌య్పూర్‌, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌, కేంద్ర‌పాలిత ప్రాంతాలైన చండీఘ‌ర్‌, పుదుచ్చేరీల‌లో ఇవి కార్మిక దినోత్స‌వం నాటి నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. అంటే ఈ న‌గ‌రాల వారికి పెట్రో బాంబు 15రోజుల‌కొక‌సారి కాకుండా ప్ర‌తిరోజూ పేలుతుంద‌న్న మాట‌. త‌గ్గితే స‌రే. పెరిగితే ఆ భారాన్ని భ‌రించాల్సిందే. దేశ‌వ్యాప్తంగా 95శాతం అంటే 58వేల పెట్రోలు పంపుల‌ను నిర్వ‌హిస్తున్న ఐఓసీ, బీపీసీఎల్‌, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు ఈ ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టును అమ‌లు చేస్తాయి. ప్ర‌స్తుతం ప్ర‌తినెలా ఒక‌టి, 16వ తేదీల‌లో ధ‌ర‌ల‌ను స‌మీక్షించి, పెంచ‌డ‌మో, త‌గ్గించ‌డ‌మో చేస్తున్నారు. తాజా ప్రాజెక్టు విజ‌య‌వంత‌మైతే, దీన్ని దేశ‌వ్యాప్తంగా అమ‌లులోకి తెచ్చేస్తారు. మార్కెట్‌కు అనుసంధాన‌మైన ధ‌ర‌ల విధానం దిశ‌గా ప్ర‌యాణం చిట్ట‌చివ‌ర‌కు ప్రారంభించామ‌ని ఐఓసీ చైర్మ‌న్ బి. అశోక్ తెలిపారు. ఈ విధానం వ‌ల్ల ధ‌ర‌ల‌లో తేడా తొల‌గిపోతుంద‌ని ఆయ‌న అంటున్నారు. 2010 జూన్ నుంచి పెట్రోలు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించే బాధ్య‌త‌ను కేంద్ర వ‌దిలించేసుకుంది. 2014 అక్టోబ‌ర్ నుంచి డీజిల్‌కూ దీనిని విస్త‌రించారు. అప్పుడ‌ప్పుడు దీనిపై రాజ‌కీయ ఒత్తిళ్లు ప‌డుతూనే ఉన్నాయి. ఈ మూడు సంస్థ‌ల మ‌ధ్య రేట్ల తేడా కేవ‌లం పైస‌ల‌లోనే ఉంది. పెట్రోలును లీట‌రుకు ఐఓసీ ఢిల్లీలో 66.29కీ, బీపీసీఎల్ 66.37కు, హెచ్‌పిసీఎస్ 66.48కి అమ్ముతున్నాయి. పెట్రోలు ధ‌ర‌ల రోజు వారీ నిర్ణ‌యం లాభ‌మో న‌ష్ట‌మో తేల‌డానికి కొద్ది నెల‌లు ఆగాలి. ఈ విధానం వ‌ల్ల మార్కెట్లో అవినీతి పెరుగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. బంగారం, వెండి ధ‌ర‌లను దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు.

Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అంతర్జాలం లో “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ప్రారంభం

ఈ నెలలో అంతర్జాలం లో "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ను ప్రారంభిస్తున్నామని తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పర్వ్యాప్తి లో తానా మరో ముందడుగు...

తెలంగాణ ఉద్యోగులకు సగం జీతాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికశాఖకు ఆదేశాలు...

“అద్దె మైకు” చాలించు అంటూ సొంత పార్టీ కార్యకర్తల వాయింపు

వైకాపా ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ- హైకోర్టు పై విమర్శలు చేసిన తమ పార్టీ నేతలు, అభిమానులు చాలా వరకు...

తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్... ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్...

HOT NEWS

[X] Close
[X] Close