శ్రీలీల టాలీవుడ్లో బిజీ హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్య ఆమె ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పకునే పరిస్థితి ఏర్పడింది. అఖిల్ ‘లెనిన్’ సినిమాని బయటికి వచ్చేసింది. అంతా సెట్ అనుకున్న ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకోవడంపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె పెద్ద మొత్తంలో బల్క్ డేట్స్ ఇచ్చిందట. పవన్ సినిమాకి డేట్స్ ఇచ్చిన తర్వాతే ‘లెనిన్’ ప్రాజెక్ట్ లోకి వచ్చింది. అయితే అప్పటికే ఉస్తాద్ మూవీకి శ్రీలీల కమిట్ అయిపోవడంతో రెండు సినిమాలకు డేట్స్ సెట్ కావడం లేదు.
పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం అంటే అది హీరోయిన్స్‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. అలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే శ్రీలీల లెనిన్ సినిమాను వదిలేసి పవన్ ప్రాజెక్ట్‌కే మొగ్గు చూపిందని టాక్. శ్రీలీల తప్పుకోవడంతో లెనిన్ టీమ్ ఇప్పుడు కొత్త హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరుని పరిశీలిస్తున్నారు.